జీవీఎంసీ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్

జీవీఎంసీ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్

విశాఖపట్నం: వి న్యూస్ ప్రతినిధి జూలై 11:-

విశాఖపట్నం జిల్లా కలెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్న ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జీవీఎంసీ కమిషనర్ గా అదనపు బాధ్యతలు చేపట్టారు. బుధవారం సాయంత్రం తన కార్యాలయంలో సంబంధిత పత్రాలపై సంతకం చేసి అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. దీనిపై పలువురు జిల్లా స్థాయి అధికారులు, జీవీఎంసీ అధికారులు హర్షం వ్యక్తం చేశారు.