ఏపిఎల్ సీజన్3 ఎలిమినెటర్‌ మ్యాచ్‌ లో వైజాగ్‌ వారియర్స్‌ ఘన విజయం.

ఏపిఎల్ సీజన్3 ఎలిమినెటర్‌ మ్యాచ్‌ లో వైజాగ్‌ వారియర్స్‌ ఘన విజయం.

విశాఖపట్నం: వి న్యూస్ : జూలై 11:

వైఎస్సార్‌ ఏసీఏ–వీడీసీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌ (ఏపీఎల్‌)–3 ఎలిమినేటర్‌ మ్యాచ్‌ లో భాగంగా గురువారం మధ్యాహ్నం వైజాగ్‌ వారియర్స్, కోస్టల్‌ రైడర్స్‌ జట్లు తలపడ్డాయి. 8 వికెట్ల తేడాతో వైజాగ్‌ వారియర్స్‌ ఎలిమినేటెర్‌ రౌండ్‌ లో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలత టాస్‌ గెలిచిన వైజాగ్‌ వారియర్స్‌ బౌలింగ్‌ ఎంచుకొని బరిలోకి దిగింది. బ్యాటింగ్‌ బరిలోకి దిగిన కోస్టల్‌ రైడర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోగా 153 పరుగులు చేశారు. ఓపెనర్‌ బ్యాట్సె్మన్లు పి.అర్జున్‌ టెండూల్కర్‌ 19, కెప్టెన్‌ ఎస్‌.కె. రషీద్‌ 9 బంతుల్లో 24 పరుగులు చేసి వికెట్లు కోల్పోయారు. తరువాత దిగిన అభిషేక్‌ రెడ్డి చివరి వరకు బరిలో నిలచి 43 బంతుల్లో 42 పరుగులు చేశాడు. మిడిల్‌ ఆర్డర్‌ లో దిగిన లేఖాజ్‌ రెడ్డి 27 బంతుల్లో 43 పరుగులు చేసి స్కోరును ముందుకు నడిపించి అవుటయ్యాడు. దీనితో గడిచిన 20 ఓవర్లులో 7 వికెట్లు కోల్పోయి 153 పరుగుల లక్ష్యాన్ని వైజాగ్‌ వారియర్స్‌ జట్టు ముందు నిలిపారు.

బ్యాటింగ్‌ బరిలోకి దిగిన వైజాగ్‌ వారియర్స్‌ గడిచిన 19 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. ఓపెనర్‌ బ్యాట్స్‌మెన్లు బి.మునిష్‌ వర్మ 5 బంతుల్లో 13 పరుగులు చేసి మొదట్లోనే అవుట్‌ అయినప్పటికీ, అశ్విన్‌ హెబ్బర్‌ 51 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్స్‌తో 67 పరుగులు చేసి అర్థ సెంచరి పూర్తి చేసి ఔటయ్యాడు. తర్వాత దిగిన కెప్టెన్‌ కె.ఎస్‌.భరత్‌ వీరోచిత ప్రదర్శనతో 4 ఫోర్లు, ఒక సిక్స్‌లతో 47 బంతుల్లో 58 పరుగులు చేసి నాట్‌ అవుట్‌ గా నిలచి అర్థ సెంచరి పూర్తి చేసి కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో తన ఫినిషింగ్‌ షాట్‌ తో ఫోర్‌ కొట్టి విజయాన్ని అందించాడు. మిడిల్‌ ఆర్డర్లో దిగిన జి.ఎస్‌.పి. తేజ కూడా రాణించి 12 బంతుల్లో 14 పరుగులు చేసి జట్టు విజయానికి కృషి చేశాడు. దీనితో కోస్టల్‌ రైడర్స్‌ జట్టుపై వైజాగ్‌ వారియర్స్‌ 19 ఓవర్లులోనే 2 నష్టపోయి 157 పరుగులు చేసి ఘన విజయం సాధించింది.


*ఏపీఎల్‌ గేమ్‌ ఛేంజర్‌ అవార్డ్‌ :* జి.మల్లికార్జున

*ఆర్‌వీవీఆర్‌ సూపర్‌ స్ట్రైకర్‌ అఫ్‌ ది మ్యాచ్‌ :* యం.లెకాజ్‌రెడ్డి

*ఏసీఏ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ :* అశ్విన్‌ హెబ్బర్‌ ఎంపిక అయ్యారు.