మధురవాడ రైతు బజార్లో నిత్యావసర సరుకులు ప్రత్యేక కౌంటర్ ప్రారంభించిన భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాస్ రావు, కార్పొరేటర్ మొల్లి హేమలత

మధురవాడ రైతు బజార్లో నిత్యావసర సరుకులు ప్రత్యేక కౌంటర్ ప్రారంభించిన భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాస్ రావు, కార్పొరేటర్ మొల్లి హేమలత. 

మధురవాడ: వి న్యూస్ : జూలై 11: 


మధురవాడ రైతుబజారులో కందిపప్పు,బియ్యం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు 

రైతు బజార్ స్టాళ్లను సందర్శించి వ్యాపారస్తుల సమస్యలను తెలుసుకున్న గంటా.

బహిరంగ మార్కెట్‌లో నిత్యావసర సరకుల ధరలు పెరగడంతో సామాన్య ప్రజలను దృష్టిలో ఉంచుకుని తక్కువ ధరకే నిత్యావసరాలను అందజేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. కందిపప్పు,బియ్యాన్ని తక్కువ ధరలకు రైతు బజార్లలో అందిచేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.ఈ సందర్భంగా భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు,5వ వార్డు కార్పొరేటర్ మొల్లి హేమలతతో కలసి గురువారం మధురవాడ రైతు బజార్ లో కందిపప్పు బియ్యం విక్రయాలను ప్రారంభించారు. అనంతరం ఆయన రైతుబజార్ లో గల వ్యాపారస్తులతో మాట్లాడారు. రైతు బజార్లో గల సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు.


ముఖ్యంగా ప్రవేశ ద్వారం ఇరుకుగా ఉండడం,ప్రవేశ మార్గం చుట్టూ ప్రైవేట్ వర్తకులవ్యాపారం, వర్షం పడితే చిత్తడిగా తయారయ్యే రైతు బజారు పరిసరాలు, నీటి కొరత, ఇబ్బంది పెడుతున్న టాయిలెట్స్, రైతు బజారుకు వచ్చే విక్రయదారుల నుండి పార్కింగ్ కోసం డబ్బులు వసూలు, రైతు బజారు నిర్వాహకులు వ్యాపారస్తుల నుండి వసూలు చేస్తున్న (అద్దె)రుసుము.... ఈ సమస్యలపై స్థానిక కార్పొరేటర్ మొల్లి హేమలత భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావుకు వివరించారు.ఈ సందర్భంగా మాజీ మంత్రి గంటా మాట్లాడుతూ మధురవాడ రైతు బజార్ అభివృద్ధికి సహకరిస్తానని హామీ ఇచ్చారు.ప్రభుత్వం దేశవాళి కందిపప్పు కిలో రూ.160, నాణ్యమైన స్టీమ్‌ రైస్‌ (బీపీటీ రకం) కిలో రూ.49, రారైస్‌ కిలో రూ.48 చొప్పున రైతు బజార్లు కేందంగా విక్రయించడం జరుగుతుందని అన్నారు. ఒక్కో వినియోగదారుకు బియ్యం 5 కిలోలు,కంది పప్పు కిలో పంపిణీ చేస్తున్నామని తెలిపారు. పేద ప్రజలకు నాణ్యమైన వస్తువులు సరసమైన ధరలకు అందించే విధంగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ పనిచేస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో కోరాడ రాజబాబు,రాష్ట్ర టిడిపి బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి మొల్లి లక్ష్మణరావు,పిల్ల వెంకట్రావు, వాండ్రాసి అప్పలరాజు, శాఖారి శ్రీనుబాబు దాసరి శ్రీనివాస్,శెట్టిపల్లి గోపి,బోయి వెంకటరమణ,నమ్మి శ్రీనివాసరావు, బోయిరమాదేవి, జనసేన అధ్యక్షులు దేవర శివ, నాగోతి నరసింహా నాయుడు, వానపల్లి ఈశ్వరరావు,బొట్ట శ్రీనివాసరావు, కొండపు రాజు,గరే గురునాథ్,కానూరి అచ్యుతరావు, బొడ్డేపల్లి రంగారావు,కరుమోజు గోవిందరావు,చలుమోలు శ్రీనివాసరావు (గడ్డి శ్రీను),మామిడి దుర్గారావు,పిల్ల కృష్ణమోహన్, నారాయణ శెట్టి చక్రపాణి,నోడగల జానకిరామ్,పోతిన రఘు,పోతిన అనురాధ,నొడగల భవాని, సంతోషి, బిర్లంగి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.