వలందపేట సీసీ రోడ్లకు,కోరాడపేటలో డ్రైనేజీ కాలువకు రెండో వార్డు కార్పొరేటర్, టీడీపీ పార్టీ కౌన్సిల్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గాడు చిన్నికుమారి లక్ష్మి చేతుల మీదుగా శంకుస్థాపన

వలందపేట సీసీ రోడ్లకు,కోరాడపేటలో డ్రైనేజీ కాలువకు రెండో వార్డు కార్పొరేటర్, టీడీపీ పార్టీ కౌన్సిల్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గాడు చిన్నికుమారి లక్ష్మి చేతుల మీదుగా శంకుస్థాపన 

భీమిలి : వి న్యూస్ : జూలై 11:

స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు గంటా శ్రీనివాసరావు ఆదేశాల మేరకు వలందపేట గ్రామంలో సీసీ రోడ్లకు, మరియు కోరాడపేట గ్రామంలో నిర్మించబోయే డ్రైనేజీ కాలువకు రెండో వార్డు కార్పొరేటర్, టీడీపీ పార్టీ కౌన్సిల్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గాడు చిన్నికుమారి లక్ష్మి చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఇంతవరకు రోడ్డు లేక చాలా ఇబ్బందులు పడ్డామని, ఇప్పుడు మీరు రోడ్డు వేయడం చాలా ఆనందంగా ఉందని స్థానికులు కార్పొరేటర్ కి ధన్యవాదాలు తెలియజేసారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం సీనియర్ నాయకులు గాడు అప్పలనాయుడు, యూనిట్ ఇన్ ఛార్జ్ చోడిపిల్లి సాయి జై శంకర్, కార్యదర్శి పిట్టా వెంకట్రావు, మాజీ కౌన్సిలర్ చేట్ల రమణ మరియు స్థానిక నాయకులు బోయి అప్పలరెడ్డి, బోయి పోతురాజు, కోనాడ నారాయణరావు, బోయి లక్ష్మారెడ్డి,కోలా అప్పారావు, ఎరుసు అప్పారావు, బర్ల సూర్యనారాయణ, బర్ల రామసూరి రాయల్, ముగడ సురేష్,బోయి సాయి, బోయి శంకర్,గణపతిలతో పాటు వార్డు నాయకులు పూతి రవి, చేట్ల గురుమూర్తి రెడ్డి, బడిగింటి మహేష్, జోగ సన్యాసిరావు, కోల గోపి, నీలాపు సూరిబాబు, రిక్క సత్యవతి, చిల్లా ఎర్ర రెడ్డి,సరగడ గోపిరెడ్డి, జీరు ఈశ్వర్రావు, చేట్ల వెంకట్రావు, దుంప శంకర్రావు, ఊడికల సంతోష్, షేక్ ఇస్మాయిల్,తదితరులు పాల్గొన్నారు.