5వ వార్డు లో ఫ్రైడే-డ్రైడే కార్యక్రమం.

5వ వార్డు లో ఫ్రైడే-డ్రైడే కార్యక్రమం. 


సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.: జీవీఎంసీ 5వ వార్డ్ కార్పొరేటర్ మొల్లిహేమలత. 

మధురవాడ : వి న్యూస్ : జూలై 12: 

మధురవాడ: సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జీవీఎంసీ 5వ వార్డ్ కార్పొరేటర్ మొల్లిహేమలత అన్నారు. ఫ్రైడే-డ్రైడే కార్యక్రమంలో భాగంగా 5వ వార్డు వైయస్సార్ కాలనీ72,73వ సచివాలయం పరిధిలో జీవీఎంసీ మలేరియా ఇన్స్పెక్టర్ మంగరాజు ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.ఈసందర్భంగా 5వ వార్డ్ కార్పొరేటర్ మొల్లిహేమలత మాట్లాడుతూ..పరిసరాల పరిశుభ్రతపట్ల నిర్లక్ష్యమే అన్నింటికీ కారణమవుతుందన్నారు.ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వలన ఎలాంటి రోగాలు దరిచేరవని,నీటి నిల్వలతోనే దోమలువృద్ధి చెందుతాయని వీటి నివారణకు ప్రతిఒక్కరు అప్రమత్తంగా ఉండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ముఖ్యంగా నిరుపయోగంగా ఉన్న వస్తువుల్లో, వాడని టైర్లలో ఇంట్లో పెంచుకున్న చిన్న చిన్న మొక్కలలో అలాగే ఫ్రిడ్జ్ వెనకాల ఉన్న నిల్వ నీటిలో ప్రమాదకరమైన లార్వా వృద్ధి చెందుతుందని కావున ఎప్పటికప్పుడు వాటిని శుభ్రపరచుకోవాలని తెలిపారు. అలాగే వారంలో ప్రతి శుక్రవారం డ్రైడే పాటించేలా చూడాలని,డెంగ్యూ,మలేరియ కేసులు నమోదు అవ్వకుండా చూడాల్సిన బాధ్యత మలేరియా సిబ్బందిపై ఉందని తెలిపారు.మలేరియా ఇన్స్పెక్టర్ మంగరాజు మాట్లాడుతూ...మలేరియా సిబ్బంది ఇంటి ఇంటికి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారని కావున ప్రజలందరూ మలేరియా సిబ్బందికి సహకరించాలని అన్నారు. సిబ్బంది కూడా కచ్చితంగా రోడ్లుకాలువలు శుభ్రం పరచాలని ప్రతిఇంటి నుండి తడి చెత్త,పొడిచెత్త ప్రమాదకరమైనచెత్తను సేకరించాలని,కమర్షియల్ ఏరియాల్లో కూడాచెత్త సేకరణ జరగాలని అన్నారు.ఈ కార్యక్రమం లో టిడిపి రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి మొల్లిలక్ష్మణరావు, మలేరియా డిపార్ట్మెంట్ ఇన్స్పెక్టర్ మంగరాజు,సేనటరి ఇన్స్పెక్టర్ కాకర శ్రీనివాసరావు,వార్డ్ సచివాలయం కార్యదర్శులు,సీనియర్ టిడిపి నాయకులు నూకరాజు,ఓలేటి శ్రావణ్,మోకర రవికుమార్,మదీనా, హరికృష్ణ,విష్ణు,మాధవ,గీత, రాంబాబు,విజయ్ తదితరులు పాల్గొన్నారు.