భీమిలి పరిధి మధురవాడ ప్రాంతంలో ఉన్న మీసేవ సెంటర్లు, సచివాలయంలు ఆకస్మిక తనిఖీ నిర్వహించిన భీమిలి డి ఎల్ డి ఒ అధికారి లక్ష్మీపతి.

భీమిలి పరిధి మధురవాడ ప్రాంతంలో ఉన్న మీసేవ సెంటర్లు, సచివాలయంలు   ఆకస్మిక తనిఖీ నిర్వహించిన భీమిలి డి ఎల్ డి ఒ అధికారి లక్ష్మీపతి.

మధురవాడ : వి న్యూస్ : జూలై 12:


శుక్రవారం భీమిలి నియోజకవర్గం పరిధి మధురవాడ ప్రాంతంలో పలు మీసేవ సెంటర్లు, సచివాలయంలు భీమిలి డి ఎల్ డి ఒ అధికారి లక్ష్మీపతి ఆకస్మిక పర్యటన చేసి తనికీ నిర్వహించారు. ఈ తనిఖీలో మీసేవ ఆపరేటర్ల ప్రొసీడింగ్ ధ్రువపత్రం,విజిలెన్స్ అధికారి నెంబర్ గల బోర్డు, సర్టిఫికెట్ రిజిస్టర్, స్టాక్ రిజిస్టర్, పిర్యాదుల రిజిస్టర్, మీసేవ బోర్డు, సిటిజెన్ చార్ట్ తదితర విషయాలను పరిశీలించారు. సచివాలయంలలో స్టాఫ్ హాజరు రిజిస్టర్, ముఖ్యంగా సిఎల్ రిజిస్టర్ మరియు మూవ్మెంట్ రిజిస్టర్ ప్రతీ పేజీని క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రజలకు అందించే ధ్రువపత్రాలు సమయానుకూలంగా అందించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తద్వారా ఆరోగ్యంగా ఉండి ప్రజలకు మరింత సర్వీసులను అందించాలని సూచించారు.