జనసైనికుని కుటుంబానికి అండగా నిలిచిన టీం బొడ్డేపల్లి రఘు యువసేన వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు.
భీమిలి : పెన్ షాట్ ప్రతినిధి : జూలై 13:
శనివారం విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసైనికుడు ఆటో డ్రైవర్ వీరుబాబు గత రెండేళ్ల నుండి పక్షవాతంతో బాధపడుతూ ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నారని రెండవ ఏడాది కూడా వారి పిల్లలు రాం సుహాస్ మరియు తేజస్వి చదువుకు అవసరం అయిన నగదును 28000/- ఆర్ధిక సహాయం అందచేశారు. అలాగే సుహస్ చదువు నిమిత్తం మరో 48000/- ఆర్థిక సహాయం అందజేస్తామని టీం సభ్యులు వారి కుటుంబానికి భరోసా ఇచ్చారు. ఈ యొక్క సహాయానికి సహకరించిన ( టీం బొడ్డేపల్లి రఘు యువసేన వెల్ఫేర్ అసోసియేషన్ ) మెంబర్స్, సుఖాసి రమేష్, జగదీశ్ వర్మ , రోహిత్ రెడ్డి, భాష , శేఖర్, ఎస్ ఎన్ రావు, మోహన్, బంగారు రాజు, మణికంఠ, సురేష్, ఆదిత్య వర్మ , ఢిల్లీ సనపల, భీమిలి జగదీష్ తదితరులు పాల్గొన్నారు.
