ఓ జీవీఎంసి పారిశుధ్య సిబ్బంది మీకు ఇది న్యాయమేనా ? దుర్వాసనతో ఇబ్బంది పడుతున్న ప్రజలు. అటువైపుగా వెళ్లాలంటే భయపడుతున్న స్థానికులు.

ఓ జీవీఎంసి పారిశుధ్య సిబ్బంది మీకు ఇది న్యాయమేనా ?

దుర్వాసనతో ఇబ్బంది పడుతున్న ప్రజలు.

అటువైపుగా వెళ్లాలంటే భయపడుతున్న స్థానికులు.

విశాఖపట్నం , జులై 11 : పెన్ షాట్ ప్రతినిధి :     


           విశాఖ పూర్ణమార్కెట్ సమీపంలో సాలిపేట వద్ద ముఖ్యంగా చిన్న పిల్లల పాఠశాలకు అతి దగ్గర్లో చెత్త నిల్వ ట్రాలీను పెట్టి , చెత్త  తొలగించి, ట్రాలీలను సరైన నిర్వహణ లేకుండా అక్కడే ఉంచుతున్నారు. జీవీఎంసీ సిబ్బంది చెత్తను మాత్రం తొలగించి మిగతా మురికిని ఈ ట్రాలీలు శుభ్రం చేయకుండా అలానే పెట్టేస్తున్నారు.
మురికిని రోడ్లపై వెదజల్లడంతో అక్కడ అపరిశుభ్రత, దుర్వాసన అధికమై స్థానికులు చిన్న పిల్లలు  అనారోగ్యాలకు గురవుతున్నారు. స్థానికులు ఇక్కడ ఈ చెత్త ట్రాలీని తీసేయాలని జీవీఎంసి సిబ్బందిని కోరుతున్నారు. జీవీఎంసి సిబ్బంది ప్రతిరోజు చెత్తను మాత్రం ఎత్తివేసి, చేతులు దులుపుకొని వెళ్తున్నారని కనీసం బ్లీచింగ్ కూడా వెయ్యడం లేదని స్థానికులు వాపోతున్నారు. చెత్త ట్రాలీ నుండి వస్తున్న మురికి నీరు రోడ్లపై వదిలి వేయడంతో ఈ సమస్యలు రోజు రోజుకి పెరుగుతుందని స్థానికులు మండిపడుతున్నారు. ఉన్నతాధికారులు ద్రుష్టి సారించి సమస్యను పరిష్కరించాలని నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్న పారిశుధ్య సిబ్బంది పై చర్యలు తీకోవాలని  స్థానికులు కోరుతున్నారు