పాండ్రంకి గ్రామంలో అల్లూరి సీతారామరాజు 127వ జయంతి

పాండ్రంకి గ్రామంలో అల్లూరి సీతారామరాజు 127వ జయంతి.

పాండ్రంకి: పెన్ షాట్ ప్రతినిధి:  జులై 04:

మన్యం వీరుడు అల్లూరి సీతారామరామరాజు 127వ జయంతి సందర్భంగా వారి స్వగ్రామం అయిన పాండ్రంకి గ్రామంలో మన్యం వీరుడుకి పూల మాల వేసి నివాళులు అర్పించడం జరిగిందని రాష్ట్ర ఎస్ ఎఫ్ డీ కో కన్వీనర్ లొడగల అచ్చిబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పూర్వ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మద్దిల గణేష్ కుమార్ పాల్గొని అల్లూరి సీతారామరాజు మన అందరి ఆర్థ్య దేవుడు అని, ఆయని నేటి యువత అంత ఆదర్శంగా తీసుకొని దేశ భక్తి నీ అందరి లో నింపుకొని పని చేస్తూ,దేశం కోసం ధర్మం కోసం పని చెయ్యాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర సహా కార్యదర్శి జి.లోకేష్,బి.మహేష్,అభిషేక్, బి కె రాజు,జగన్, తదితరులు పాల్గొన్నారు.