అన్న క్యాంటీన్లకు పూర్వ వైభవం: 5వ వార్డ్ కార్పొరేటర్ మొల్లి హేమలత.
మధురవాడ: వి న్యూస్: జులై 04:
మారికవలస రాజీవ్ గృహకల్ప కాలనిలో గల అన్న క్యాంటీన్ భవనానికి ఆధునీకరణ పనులకు శంకుస్థాపన.
మధురవాడ: పేదల పక్షపాతి అయిన చంద్రన్న సారధ్యంలో నిరుపేదలకు అండగా ఉంటూ పేడోడికి పట్టెడన్నం పూటకు రూ.5 కే అందిస్తూ మూడు పూటలా కడుపు నిండా ఆహారాన్ని అందించే అన్నా కేంటిన్స్ బడుగు బలహీన వర్గాల పాలిట వరం అని 5వ వార్డ్ కార్పొరేటర్ మొల్లి హేమలత అన్నారు.ఆమె ఆధ్వర్యంలో 5వ వార్డ్ మధురవాడ,మారికవలస రాజీవ్ గృహకల్ప కాలనిలో గల అన్న క్యాంటీన్ భవన ఆధునీకరణ పనులకు శంకుస్థాపనకు ముఖ్యఅతిథిగా భీమిలి శాసనసభ్యులు గంటా శ్రీనివాసరావు.... తనయుడు గంటా రవితేజ హాజరై కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా కార్పొరేటర్ మొల్లిహేమలత,టిడిపి రాష్ట్ర బీసీ సెల్ ప్రధానకార్యదర్శి మొల్లి లక్ష్మణరావు మాట్లాడుతూ...
ఆహ్లాదకరమైన వాతావరణంలో పూటకు రూ.5 చొప్పున నాణ్యమైన ఆహారం మూడు పూటలా అందించడం నిరుపేదలకు ఒక వరమని,అనాధలుగా రోడ్లు పక్కన నివసించేవారు,నిరుపేదలు ఈ అన్న క్యాంటీన్లో మూడుపూట్లా కడుపునిండా అన్నం తిని తన జీవన గమనాన్ని ఆరోగ్యకరంగా ముందుకు సాగించడానికి ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. కార్యక్రమంలో టిడిపి వార్డ్ అధ్యక్షులు నాగోతి వెంకట సత్యనారాయణ(జపాన్),జనసేన అధ్యక్షులు దేవర శివ,మాజీ కార్పొరేటర్ మన్యాల సోంబాబు,పార్లమెంటరీ ఉపాధ్యక్షులు బోయి వెంకట రమణ, బోయి రమాదేవి,నమ్మి శ్రీను,వార్డ్ ప్రధాన కార్యదర్శి ఈగల రవి కుమార్,వియ్యపు నాయుడు,చక్రపాణి,మాచర్ల నాగేశ్వరావురావు,కాంబపు కామరాజు,యువత అధ్యక్షులు కొండపు రాజు,రామునాయుడు, ఆనందరావు,రమణమ్మ,ఈగల అప్పల నాయుడు,రాము నాయుడు, గంటా రమేష్,చంటి,కృష్ణవేణి, నూకరాజు,మదీనా, సత్యనారాయణ స్థానిక నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



.jpeg)