పోతినమ్మల్లయ్యపాలెం పలు ప్రాంతాలలో పించిన్ పంపిణీ చేసిన జనసేన నేతలు. పీఎంపాలెం : పెన్ షాట్ ప్రతినిధి : జూలై 01:
పీఎంపాలెం పలు ప్రాంతాలలో కూటమి జనసేన నేతలు ఫించన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం పీఎంపాలెం, ఆర్ హెచ్ కాలనీ, లక్ష్మీవాని పాలెం ప్రాంతాలలో జనసేన 6వవార్డ్ అధ్యక్షులు సంతోష్ నాయుడు ఆధ్వర్యంలో జనసేన వీర మహిళ గరే సన్నియమ్మ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వికలాంగులకు, వృద్దులు, వితంతువులకు నూతన ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కట్టుబడి పెంచిన ఫించన్ ను లబ్ధిదారులకు అందచేశారు. ఈ కార్యక్రమంలో కనకరాజు మాస్టర్ ప్రమీల, లీల, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

