భీమిలి నియోజకవర్గం పలు ప్రాంతంలో ఫించన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రావు

భీమిలి నియోజకవర్గం పలు ప్రాంతంలో ఫించన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రావు.               

చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన గంటా.          

నూతన కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అన్న గంటా శ్రీనివాస్               

మధురవాడ : పెన్ షాట్ ప్రతినిధి : జూలై 01:     


స్వతంత్రనగర్లో వార్డుల ఫించన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. 5వవార్డ్ కార్పొరేటర్ మొల్లి హేమలత, 7వవార్డ్ కార్పొరేటర్ పిళ్ళా మంగమ్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసి అనంతరం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం నూతన కూటమి ఏర్పాటు అయ్యిన తరువాత మొదటి ఫించన్ పంపిణీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసారు. రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చెయ్యని విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఇంటిఇంటికి వెళ్లి ఫించన్ పంపిణీ చేసారు అన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 6గంటల నుంచే పింఛన్లు పంపిణీ చేయడం జరిగింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ విధంగా అలానే పెంచన్లు పంపిణీ చేయడం జరిగింది.
ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగోకపోయిన పింఛన్లు పంపిణీ చేయడం జరిగింది. మొత్తం 28 కేటగిరిలో ఈ పింఛన్లు పంపిణీ చేశాం.
పెనుమాక గ్రామంలో సిఎం చంద్రబాబు, లోకేష్, పిఠాపురంలో పవన్ ఈ పింఛన్లు పంపిణీ చేశారు.
ముఖ్యమంత్రి అయ్యాక మొదటిగా డీఎస్సీపై సంతకం చేశారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం యువతను ఉద్యోగాలు పేరిట మోసం చేశారు అంటూ తీవ్రంగా మండి పడ్డారు. రాజశేఖర్ రెడ్డి 75 నుంచి 200 రూపాయలు పెంచితే చాలా గొప్పగా చెప్పుకున్నారు. గత ముఖ్యమంత్రి 2000నుండి 3000 ఫించన్ పెంచడానికి 5సంవత్సరాల పట్టింది.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద కూడా సిఎం చంద్రబాబు సంతకం చేశారు. ఇది ప్రజా ప్రభుత్వం. మేలో జరిగిన ఎన్నికలలో ప్రజలు ఇచ్చిన తీర్పు ఎవ్వరూ మర్చిపోలేరు.
రాష్ట్రంలో ఎక్కడ చూసినా అత్యధిక మెజారిటీతో గెలవడం జరిగింది. జనసేన నుంచి 21స్థానాల్లో పోటీ చేసి 21స్థానాలలో గెలుపొందారు.
ఈ తీర్పును చూసి జగన్ మోహన్ రెడ్డి నేను హిమాలయాలుకు వెళ్ళిపోత అని ఆయన స్వయంగా అనడం మనం చూశాం.
స్వయంగా ముఖ్యమంత్రి ఫించన్ పంపిణీలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది.
అధికారులు ఈ కార్యక్రమాన్ని తూతూ మంత్రంగా కాకుండా ఈ కార్యక్రమాన్ని సీరియస్ గా తీసుకోవాలి. అర్హత ఉన్న కొత్త ఫింఛన్లు పెట్టుకున్నట్లు అయితే వారికి కూడా ఇవ్వడం జరుగుతుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మధురవాడ టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.