అబ్బుర పరిచిన కోలాటం ఇంటర్ జిల్లా కోలాటం పోటీలు
మధురవాడ : వి న్యూస్ : జూన్ 19:
రైల్వే న్యూ కాలనీ కే ఎన్ ఎమ్ పాఠశాల ఆవరణలో ఇంటర్ జిల్లా కోలాటం పోటీలు ఆదివారం నిర్వహించారు. ఈ పోటీలలో విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా 13 కోలాటం బృందాలు పాల్గొన్నాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ఏపీ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ పి వి ఎన్ మాధవ్ పాల్గొని విజేత బృందాలకు బహుమతులు అందచేశారు. ఈ కార్యక్రమం ను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ సంస్కృతిక సంప్రదాయలను, కలలను అనుసరించి వాటిని అందరికి గుర్తు చేస్తూ అంతరించిపోకుండా ఉండేందుకు ఇటువంటి పోటీలు నిర్వహిస్తుండాలని నిర్వహించేవారికి ప్రోత్సాహించాలని పోటీలలో పాల్గొనే వారిని ఆయన అభినందించారు. పోటీలలో మధురవాడ నుండి శ్రీలక్ష్మి నరసింహ కోలాటం బృందం ను ప్రత్యేకంగా ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు ప్రకాష్ రెడ్డి, డాక్టర్ సింధూష, సంస్థ నిర్వాహకులుపట్టా శ్రీధర్, ఫనీంద్ర, మాధవి, చార్లెస్ తదితరులు పాల్గొన్నారు.
