విధ్య అనేది ఒక్కప్రాముఖ్యత చెందినది:-పిళ్లా మంగమ్మ
మధురవాడ :వి న్యూస్ ప్రతినిధి : జూన్ 19:
ప్రతి ఒక్కరూ చదువుకుంటే ఒక ఉన్నతమైన స్థాయికి చేరుతారని అలాగే విద్య అనేది ఎవరు దొంగలించలేనిది ఒక ప్రాముఖ్యత చెందినది విద్యా అని పిళ్లా మంగమ్మ అన్నారు.
జీవీఎంసీ జోన్ టు పరిధిలోని 7వ వార్డ్ స్వతంత్ర నగర్ అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర ఉన్న మండల ప్రాధమిక అప్పర్ ప్రైమరీ పాఠశాలలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకంలో భాగంగా పిల్లలకు పుస్తకాలు మరియు బాగ్స్, బూట్లు ఏడవ వార్డ్ కార్పొరేటర్ పిళ్లా మంగమ్మ చేతుల మీదగా బుధవారం పంపిణీ చేసారు. ఈ సందర్భంగా పిళ్లా మంగమ్మ మాట్లాడుతూ ఒక వ్యక్తిని ఉన్న స్థాయికి చేర్చాలంటే అది ఒక చదువు వల్లే అవుతుందని చదువుకుంటే సమాజంలో ఒక గుర్తింపు పొందుతారని అందుకని ప్రతి ఒక్కరూ చదువుకోవాలని ఆర్థిక పరిస్థితుల వల్ల చదవలేక పోయిన వారి గురించి కూటమి ప్రభుత్వం ఆలోచించి ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి ఒక్కరికి పుస్తకాలు బ్యాగు బూట్లు అందించి వారు చదువుకోవడానికి అన్ని విధాలుగా ప్రభుత్వం తోడు ఉంటుందని తెలపడానికే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ఉచిత పుస్తకాలు పంపిణీ చేయడం జరుగుతుందని పిళ్ళ. మంగమ్మ అన్నారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, నాయకురాలు పాల్గొన్నారు.

