ధర్మ ప్రచార మహోత్సవాలలో అద్భుత కోలాట నృత్య ప్రదర్శన.
విశాఖ : వి న్యూస్ : జనవరి 01:
శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో 2023 డిసెంబర్ 19 నుండి 2024 జనవరి 18 ధర్మ ప్రచార మహోత్సవాలు ఆలయ చైర్మన్ మరియు ధర్మ కర్తల మండలి కొల్లి సింహాచలం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ధర్మ ప్రచార మహోత్సవాలులో భాగంగా సోమవారం మధురవాడ కి చెందిన శ్రీ లక్ష్మీ నరసింహ కోలాట బృందం గురువు సిరిపురపు సంతోషి ఆధ్వర్యంలో 10మంది బృందం చేసిన కోలాట నృత్యం ఎంత గానో ఆకట్టుకున్నాయని తిలకించిన భక్తులు కొనియాడారు. ఇటువంటి ధర్మ ప్రచార ఉత్సవాలు ప్రతీ ఆలయ ప్రాంగణంలో నిర్వహించాలని భక్తులు తెలిపారు.
