పారిశుద్ధ్య కార్మికుల కోరికలను తీర్చాల్సిన బాధ్యత వైసిపి ప్రభుత్వానికి లేదా?పిళ్ళా.మంగమ్మ
మధురవాడ : వి న్యూస్ : జనవరి 01 :
విశాఖ జీవీఎంసీ జోన్ టు పరిధిలో సీఐటీయూ ఆధ్వర్యంలో 7వ వార్డు లో ద్రోణంరాజు కళ్యాణమండపం దగ్గర పారిశుద్ధ్య కార్మికులు ధర్నా 7వ రోజుకు చేరింది. ఎటు చూసినా వీధుల్లో చెత్త పెరిగిపోయి దుర్వాసన తో నిండుకున్నయి. పారిశుద్ధ కార్మికులకు మేమున్నాము అంటూ వారి సమస్యలను అడిగి తెలుసుకుని సంఘీభావం తెలియజేసిన 7 వ వార్డు కార్పొరేటర్ పిళ్ళా.మంగమ్మ మరియు టీడీపీ నాయకులు.ఈ సందర్భంగా కార్పోరేటర్ పిళ్ళా. మంగమ్మ మాట్లాడుతూ నేటికీ పారిశుధ్య కార్మికుల సమ్మె 7 రోజులకీ చేరిన ఇంకా వారి డిమాండ్ కోసం కానీ వారి కోసం కానీ రాని పట్టించుకోని మొండి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం, పారిశుధ్య కార్మికులు రోడ్లమీద వంట వార్పు కార్యక్రమం చేసుకుంటూ రాత్రి పగలు వారు రోడ్ల మీద ఉండి వారి నిరసనలు తెలియజేస్తున్నారు. మీ సరదాల కోసం కోట్లు కోట్లు ఖర్చు పెట్టే వైసిపి ప్రభుత్వం ప్రతినిత్యం ప్రజల శ్రేయస్సు ఆరోగ్యం కోసం పాటుపడుతున్న పారిశుద్ధ కార్మికుల కోరికలను తీర్చాల్సిన బాధ్యత వైసిపి ప్రభుత్వానికి లేదా అంటూ ప్రశ్నించారు? ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర వాణిజ్య విభాగ నిర్వాహక కార్యదర్శి పిళ్ళా వెంకటరావు,టీడీపీ సీనియర్ నాయకులు నాగోతి.సూర్య ప్రకాష్,పోతిన నాయుడు, పిసా.చిన్న పోతిన బుజ్జి,పోతిన.వినయ్ తదితరులు పాల్గొన్నారు..

