గిరిజన రైతులను ఆదుకోండి
అల్లూరి సీతారామరాజు జిల్లా : వి న్యూస్ : డిసెంబర్ 5 :-
అల్లూరి సీతారామరాజు జిల్లా చాలా మండలాలలో మిచౌంగ్ తుఫాను ప్రభావం తో ఉగ్రరూపం దాల్చడంతో గిరిజన రైతులు అల్లాడుతున్నారు.ఏజెన్సీ ప్రాంతంలో అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలలలో వరి ధాన్యం చేతికి అందుతుంది ఆ తరుణంలో అదే నెలలో వరి కోతలు ప్రారంభమవుతాయి కానీ కోతలు కోసే టైంలో వర్షాలు రావడంతో పూర్తిగా కోత కోసిన వరి ధాన్యం తడవడం వల్ల రైతుకు నష్టం వాటిల్లుతుంది ఇదే తరుణంలో గూడెం కొత్త వీధి, జి మాడుగుల,పాడేరు పెదబయలు,అరుకు ఇలా చాలా మండలాలలో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల కోసిన వరి పొలాలలో ఉండిపోయి మరికొన్ని చోట్ల కోసిన ధాన్యం కల్లాల్లో ఆరబెట్టి టార్పన్ కవర్లు కప్పినా ఫలితం లేకుండా భారీ వర్షాలకు ధాన్యం తడిసిపోతుందని ఏజెన్సీ రైతులు బాధను విలపిస్తున్నారు ఇలాంటి విషయంపై సంబంధిత అధికారులు స్పందించి నష్ట పోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

