తుఫాన్ ప్రభావంతో నష్టపోయినా రైతాంగానికి ప్రభుత్వం ఆదుకోవాలి..
సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంతెన సీతారాం.
వి న్యూస్ ప్రతినిధి: డిసెంబర్05 :చింతూరు:
మిచౌంగ్ తుఫాను కారణంగా ఏజెన్సీ ప్రాంతంలో దెబ్బతిన్న అన్ని రకాల పంటలకు సర్వేలు నిర్వహించి బాధితంగాలన్నిటిని ప్రభుత్వం ఆదుకోవాలని నష్టపరిహారం చెల్లించాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంతెన సీతారాం మంగళవారం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆరుగాలం కష్టించి అప్పులు చేసి వరి నువ్వు, పత్తి పంటలను వేయడం జరిగిందని కోతకు వచ్చి నా వరి పైరు తుఫాను కారణంగా సర్వనాశనం అయిపోయిందని రైతుల కు కన్నీరే మిగిలింది అన్నారు. గత నెలలో కూడా వచ్చిన తుఫాను కారణంగా అనేక రకాల పంటలు దెబ్బతిన్నాయని రైతుల కు తీరని నష్టం వాటిలిందన్నారు. సకాలంలో వర్షాలు పడక వర్షాభావ పరిస్థితుల్లోనూ పంటలు దిగుబడి తగ్గిపోవడంతో పాటు అకాల వర్షాలకు రైతులు పంటలు పాడైపోయాయన్నారు. కేవలం ఒక్క చింతూరు మండలంలోని 4114 హెక్టార్ల వరి పంట వేయడం జరిగిందని. 440 హెక్టార్ల పత్తి పంట సాగులో ఉందని. తుఫాను కారణంగా పంటలు పూర్తిగా దెబ్బ తినడంతో రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది అన్నారు. చింతూరు డివిజన్ వ్యాప్తంగా దెబ్బతిన్న రైతుల పంటలకు తక్షణమే ఆయా పంటల నష్టంపై వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సర్వేలు నిర్వహించి నష్టపోయిన రైతులకు పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. ఈసమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు మర్లపాటి నాగేశ్వరరావు .జిల్లా కమిటీ సభ్యులు సత్యనారాయణ. పల్లపు వెంకట్. రంపచోడవరం జిల్లా కార్యదర్శి బొప్పన కిరణ్. చింతూరు మండల కార్యదర్శి సిసం సురేష్ ,కూనవరం మండల కార్యదర్శి పాయo సీతారామయ్య. ఎటపాక మండల కార్యదర్శి ఐ వి తదితరులు పాల్గొన్నారు.
