రోడ్డు సౌకర్యం లేక డోలిమోత కష్టాలు

రోడ్డు సౌకర్యం లేక డోలిమోత కష్టాలు

అల్లూరి జిల్లా, పెదబయలు పెన్ షాట్ న్యూస్ డిసెంబర్ 5 

అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం గుల్లెలు పంచాయితీ రెంజల మామిడి గ్రామము నుండి.... వివరాల్లోకి వెళితే రెంజల మామిడి నుండి సుమారు 5 కిలోమీటర్లు దూరం వరకు సరైన రోడ్డు సౌకర్యం లేక డోలిమోతలలో రాయి మామిడి రోడ్డు జంక్షన్ వరకు గర్భిణీ స్త్రీ బోండా సంకమ్మ ను కుటుంబీకులుతో ఆశ వర్కర్ లకే సంకమ్మ సహ కలసి డోలిమోతలతో రాయిమామిడి జంక్షన్ వరకు తీసుకుని వెళ్లి అక్కడ నుండి 108 అంబులెన్స్ నుండి ముంచంగిపుట్ మండల ఆసుపత్రికి తీసుకెళ్లవలసి వచ్చిందని ఆ గ్రామస్తులు చెప్పుకొచ్చారు.ప్రస్తుతం గర్భిణీ స్త్రీ బోండా సంకమ్మకు ఆడబిడ్డ జన్మనిచ్చి క్షేమముగా ఉన్నారు అని కుటుంబీకులు చెబుతూ.... రెంజల మామిడి గ్రామమునకు సంబంధిత అధికారులు నాయకులు స్పందించి రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. రోడ్డు కోసం ఎన్నోసార్లు చెప్పినప్పటికీ ఎవరూ పట్టించుకోవటం లేదని చెప్పుకొచ్చారు తక్షణమే మా డోలి మోత కష్టాలు తీర్చాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.