41వ సచివాలయంలో 49750 రూపాయలు పింఛన్ల సొమ్ము చోరీ.

41వ సచివాలయంలో 49750 రూపాయలు పింఛన్ల సొమ్ము చోరీ.

పీఎం పాలెం : పెన్ షాట్ ప్రతినిధి :డిసెంబర్ 05: 

డిసెంబర్ 05: జీవీఎంసీ జోన్-2 పరిధిలోని 41వ సచివాలయం వెల్ఫేర్ సెక్రటరీ పింఛను దారులకు పంపిణీ చేసేందుకు గత నెల 30న బ్యాంకు నుంచి రూ.8 లక్షలు డ్రా చేశారు. సచివాలయంలో వార్డుల వారీగా వలంటీర్లకు డబ్బులు అందజేయడానికి కట్టలు కట్టి టేబుల్పై పెట్టారు. అందులో రూ.49,750 చోరీకి గురైనట్టు గుర్తించారు. ఆ సమయంలో సచివాలయంలో సిబ్బంది, వలంటీర్లు తప్ప ఎవరూ లేరని వెల్ఫేర్ సెక్రటరీ చెబుతున్నారు. సోమవారం జోన్-2 కార్యాలయంలో జోనల్ కమిషనర్ (జడ్సీ) కనకమహాలక్ష్మి దృష్టికి తీసుకు వెళ్లడంతో వెలుగులోకి రావటం తో సచివాలయం సిబ్బందిని జీవీఎంసీ కార్యాలయానికి రప్పించి విచారించారు. విచారణ లో వెల్ఫేర్ సెక్రటరీ ఇటువంటి ఘటనలు గతంలో కూడా జరిగాయని గతంలో చో్రీ సొమ్ము తక్కువగా కావటంతో నేనే భరించానని మళ్లీ మళ్లీ జరుగుతుండటం ఇది పెద్ద మొత్తం కావటంతో మీ దృష్టికి తీసుకువచ్చానని జోన్ 2 కమీషనర్ కి తెలిపారు. జోన్ 2 కమీషనర్ సచివాలయం సిబ్బంది పెన్షన్ సొమ్ము చో్రీ విషయం పై ఎవరు నోరు విప్పకపోవటంతో పోలీసులకు పిర్యాదు చెయ్యాలని సూపరింటెండెంట్ కి ఆదేశాలు జారీ చెయ్యటంతో మంగళవారం పీఎం పాలెం పోలీస్ స్టేషన్ లో జీవీఎంసీ జోన్2 కార్యాలయం నుంచి పిర్యాదు చేసి సచివాలయం లో పెన్షన్ సొమ్ము చో్రీ విచారణ చేపట్టాలని కోరారు.