వెళ్ళంకిలో ఘనంగా అటల్ బిహారి వాజ్ పేయి జయంతి వేడుకలు

వెళ్ళంకిలో ఘనంగా అటల్ బిహారి వాజ్ పేయి జయంతి వేడుకలు:-  

వెళ్ళంకి : వి న్యూస్ : డిసెంబర్ 25: 

విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గంలో ఆనందపురం మండలం వెళ్ళంకి గ్రామంలో స్వర్గీయ మాజీ ప్రధాని దివంగత అటల్ బీహార్ వాజ్ పేయి జయంతి వేడుకలు జాతీయ సుపరిపాలన దినోత్సవం సందర్భంగా ఈ రోజు వెల్లంకి గ్రామం లో బిజెపి శక్తి కేంద్ర బూత్ స్థాయి అధ్యక్షులు,ఆధ్వర్యంలో

ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విశాఖ జిల్లా బిజేపి కిసాన్ మోర్చ అధ్యక్షులు పి.వి.వి. ప్రసాదరావు పట్నాయక్ ముందుగా స్వర్గీయ మాజీ ప్రధాని వాజ్పేయి చిత్రపటానికి పూలమాల వేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా వెల్లంకి పోలింగ్ బూత్ అధ్యక్షులు పి.సాయి రమేష్,బోర శ్రీను,కే.వి.వి. సూర్య నారాయణ,ఇంటి సత్తిరాజు చేతుల మీదుగా భారతీయ జనతాపార్టీ జెండాను ఎగరవేశారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన విశాఖ జిల్లా కిసాన్ మోర్చ అధ్యక్షులు పి.వి వి.ప్రసాదరావు పట్నాయక్ మాట్లాడుతూ,స్వర్గీయ మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజ్పేయి  ప్రధానమంత్రిగా ఆయన హయంలో గ్రామీణ సడక్ యోజన పథకం,ప్రవేశ పెట్టారు అని భారతదేశంలో నేషనల్ హైవేలు,ఈ రోజు అభివృద్ధి జరిగిందంటే స్వర్గీయ మాజీ ప్రధానమంత్రి వాజ్పేయి గారు హయాoలో ప్రవేశపెట్టిన పథకాల అని భారతదేశాన్ని దశ దిశ మార్చారని మాట్లాడారు.ఈ సందర్భంగా అందరికీ స్వీట్లు పంచారు. ఈ కార్యక్రమం లో పాల్గొన్నవారు:- పోస్ట్ మాష్టర్ ఎస్.వి.కృష్ణా రావు, బిజెపి విశాఖజిల్లా మహిళా మోర్చ నాయకురాలు మాద బత్తుల బుజ్జి, బిజేపి వెల్లంకి బూత్ స్థాయి నాయకులు,పి.క్రాంతి,పొన్నాడ గురయ్యా,రౌత్ రమణ,కొమ్ము శంకర్,టీ.గోవిందా,కే.వి.రమణ,కె. ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.