టీం తారక్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నందమూరి హరికృష్ణ జన్మదిన వేడుకలు :
ఆనందపురం:
ఆనందపురం : నటుడు, రాజకీయ నాయకుడు అయినటువంటి స్వర్గీయ నందమూరి హరికృష్ణ జన్మదినోత్సవాన్ని టీం తారక్ ట్రస్ట్ సభ్యులు నాగిశెట్టి పృథ్వీరాజ్ ఆధ్వర్యంలో నీళ్లకుండీలు జంక్షన్ వద్ద ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి, నివాళులర్పించి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న విశాఖపట్నం జిల్లా టీం తారక్ ట్రస్ట్ కో - ఆర్డినేటర్ లెంక సురేష్ మాట్లాడుతూ హరికృష్ణ తండ్రి కి ఒక మంచి కొడుకుగా, కొడుకులకు ఒక మంచి తండ్రి గా అందరికీ ఆదర్శప్రాయంగా బ్రతికారు అని అన్నారు.
తన తండ్రి రాజకీయాల కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేసిన ఒక గొప్ప వ్యక్తి అని కొనియాడారు. అనంతరం ట్రస్ట్ సభ్యులు కోరుకుండ శరత్ కుమార్ చేతుల మీదుగా ఆనందపురం - పెందుర్తి ప్రధాన రహదారి లో గల నిరాశ్రయులకు, మతిస్థిమితం లేనివారికి మధ్యాహ్న భోజన ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బూర్లు శ్రీను, కోరుకుండ రమేష్, నాగిశెట్టి శ్రీను, ఉమ్మడి సురేష్, పక్కుర్తి అప్పలనాయుడు, తోనంగి అప్పారావు, యమరాణి సురేష్, కోరుకుండ సురేష్, బూర్లు రవి, నాగిశెట్టి సురేంద్ర, పక్కుర్తి సాయి, గండ్రెడ్డి భరత్, కోరుకుండ భాను, పాడ్రంకి శ్రీనివాస్ నాయుడు , వంశీ , కోరాడ వాసు, గుర్ల కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.