ఎన్టీఆర్ హుదూద్ కాలనీలో భారీ అన్న సమరాధన : ముఖ్య అతిథిగా పాల్గొన్న ఐదవ వార్డ్ కార్పొరేటర్ మొల్లి హేమలత
మధురవాడ:
మధురవాడ : వినాయక చవితి నవరాత్రులలో భాగంగా ఎన్టీఆర్ హుదూద్ కాలనీలో భారీ అన్న సమరాధన ను కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ అన్న సమరాధనకు కాలనీ సంక్షేమ సంఘం ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా ఐదవ వార్డ్ కార్పోరేటర్ మొల్లి హేమలత పాల్గొని అన్న సమరాదనను ప్రారంభించారు. కార్పొరేటర్ మొలి హేమలత భక్తులందరికీ స్వయంగా వడ్డించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మొల్లి హేమలత మాట్లాడుతూ మనం ఏ కార్యక్రమం చేసిన మొదట పూజించేది ఆదిదేవుడు అయినా వినాయకుడినే పూజిస్తాం. ఎందుకంటే మనం ఏ కార్యక్రమం చేసిన విజ్ఞాలు కలగకుండా విఘ్నేశ్వరుడు కరుణిస్తాడని. కావున ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని ఆ విఘ్నేశ్వరుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ పెద్దలు ప్రసాద్, జోగేశ్వర పాత్ర, కొత్తల శ్రీనివాసరావు, శ్రీను ,కాలనీ సంక్షేమ సంఘం పెద్దలు, మహిళల తదితరులు పాల్గొన్నారు.