తలసేమియా చిన్నారుల కోసం ఓ ఎస్ జి ఫౌండేషన్ సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

తలసేమియా  చిన్నారుల  కోసం  ఓ ఎస్ జి  ఫౌండేషన్ సంస్థ  ఆధ్వర్యంలో   రక్తదాన శిబిరం

భీమిలి; విశాఖ లోకల్ న్యూస్

భీమిలి ఆనందపురం మండలం లో జనసేన పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్బంగా గంబీరం పంచాయితీ జనసైనికులు ప్రతి  21  రోజులకు  ఒకసారి రక్తం  అవసరం ఐయ్యే  తలసేమియా  చిన్నారుల  కోసం   OSG  ఫౌండేషన్ సంస్థ  ఆధ్వర్యంలో NTR  బ్లడ్ బాంక్ సహకారంతో  నిర్వహించిన  రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. 

జనసేన  నాయకుడు సురక్ష హాస్పిటల్  బొడ్డేపలి రఘు విచ్చేసి ఆయన  మాట్లాడుతూ ఈ రక్తదాన  శిబిరాన్ని జనసేన  అధినేత  పవన్కళ్యాణ్  జన్మదిన సందర్బంగా ఏర్పాటు చేయడం  చాలా  ఆనందంగా  వుంది  అని అన్నారు ఈ రక్తం మీము ఇచ్చిన ఎందుకు మా వద్ద డబ్బు ఛార్జ్ చేస్తారు అనే దాని మీద వివరణ ఇచ్చారు అన్ని దానాలకన్నా రక్తదానం మిన్న అని ఈ రక్తదాన  శిబిరాన్ని అందరూ ఉపయోగించుకొని  రక్త హీనతితో  భాధపడుతున్న  తలసేమియా  చిన్నారులని  ఆదుకోవాలి  అని కోరారు.మన జనసైనికులు ప్రజలకి  ఉపయోగపడే  ఇలాంటి మంచి  కార్యక్రమాలు  ఇంకెన్నో చేయాలని పిలుపినిచ్చారు.ఎంతో  ఆశయంతో OSG ఫౌండేషన్    స్థాపించి ఎంతో  మంది  పిల్లల  ప్రాణాల్ని కాపాడుతున్న OSG ఫౌండేషన్ సభ్యులను అభినందించారు.అలాగే ఈ సేకరించిన రక్తాన్ని చిన్నపిల్లలకి , గర్భిణీస్త్రీలకు మరియు ప్రాణాపాయ స్థితిలో ఉన్నవాళ్ళకి  ఉపయోగిస్తామని వెల్లడించటం  జరిగింది.