ఇంకుడు గుంతలలో పిల్లలు పడి పొతే భాద్యులెవరు?

తూతూ మంత్రంగా ఇంకుడు గుంతలు నిర్వహణ. 

ఇంకుడు గుంతలలో పిల్లలు పడి పొతే భాద్యులెవరు?

పద్మనాభం మండల టెక్నికల్ అసిస్టెంట్ మురళీ కృష్ణ. గుంతలు తవ్వి సక్రమంగా పూడ్చాలని సూచించకపోవటంతో వదిలేసిన నివాసితులు.

పద్మనాభం మండలం, తునివలస

పంచాయతీ జగనన్న కాలనీలో ప్రతి ఇంటికి

ఇంకుడు గుంతలు ఉండాలని ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు

జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాలతో పద్మనాభం

మండలం టెక్నికల్ అసిస్టెంట్ మురళీ కృష్ణ ప్రతి

ఇంటికి వెళ్ళి గుంతలును పరిశీలించి దానికి

కావలసిన మెటీరియల్స్ ఫిబ్రవరి 18వ తేదీన పంపిణీ చేసారు. ప్రతీ ఒక్కరు ఇంకుడు గుంతలను ఉంచటంవలన వర్షం నీరు కాలువలలోనికి వెళ్లి వృధా కాకుండా భూమిలోకి ఇంకుతుందని తద్వారా భూమిలో నీరు నిల్వ వుంటుందని ఆయన సూచించారు. అనంతరం ఇంకుడు గుంతలు కొరకు తవ్విన గోతులలో డ్రమ్ములు పెట్టి పూడ్చకుండా నివాసితులు అలానే వదిలేశారు. నివాసితులకు అదికారులు తవ్విన గోతులలో డ్రమ్ములు పెట్టి గుంతలను పూడ్చాలని సూచించక పోవటంతో నివాసితులు అలానే వదిలేసినట్లు తెలుపుతున్నారు.


గుంతలు పూడ్చకపోవటంతో నీరు ఇంకుడు గుంతలలోకి వెళ్లకుండా వృధాగా రోడ్లపై పారుతుంది. నీరు రోడ్లపై పారటంవళ్ళ రోడ్లు బురదయ్యి రోడ్లపై నడవటానికి చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని కొందరు నివాసితులు వాపోతున్నారు. అదికారులు సరిగా ఇంకుడు గుంతలుపై అవగాహన కల్పించక పోవటం వల్లే ఆలా వదిలేశారని స్థానిక నివాసితులు తెలుపుతున్నారు. ఈ సమస్యను పద్మనాభం 
మండల టెక్నికల్ అసిస్టెంట్ మురళీ కృష్ణ దృష్టికి సమస్యను కొందరు నివాసితులు తీసుకువెళ్లగా మీరు చూసుకోండి ఆరోజు పరిశీలించాను అక్కడితో నా పని అయ్యిపోయింది మీరెలా పొతే నాకేంటి అనే విధంగా వ్యవహారిస్తున్నారని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు ద్రుష్టి సారించి ఇంకుడు గుంతలను నివాసితులు సక్రమంగా పూడ్చి ప్రమాదాలు జరగకుండా గుంతలు ఉపయోగించాలని వారికి అవగాహన కల్పించే విధంగా చూడాలని కొందరు స్థానికులు కోరుతున్నారు.