పైడిమాంబ మహిళా సంక్షేమ సంఘం నూతన భవనం ప్రారంభోత్సవం.
మధురవాడ:
మధురవాడ: ఆగస్ట్ 17: డాక్ యార్డ్ కాలనీలో పైడిమాంబ మహిళా సంక్షేమ సంఘం నూతన భవనం ప్రారంభోత్సవం జరిగింది. 1994లో కాలనీ ఏర్పడ్డాక అక్కడ నివాసితులు అందరూ కలసి అక్కడ గ్రామ దేవత అయిన పైడిమాంబ నామంతో సంక్షేమ సంఘం 16 జనవరి 1994 సంవత్సరంలో చిన్నపాటి కమ్మల పాకలో ఏర్పాటు చేశారు. కాలం గడుస్తున్న కొద్ది మధురవాడ ఆచుట్టు ప్రక్కల ప్రాంతాలు అభివృద్ధి చెందాయి. ఆవిధంగా డాక్ యార్డ్ కాలనీ కూడా నూతన రూపును సంతరించుకుంది. ఇక డాక్ యార్డ్ కాలనీ వాసులు అందరూ కలిసి ఏర్పాటు చేసిన సంఘానికి ప్రస్తుతం అధ్యక్షురాలుగా నాగమ్మ భాద్యతలు చేపట్టాక నూతన భవన నిర్మాణానికి నాంది వేశారు. ఆమె, కాలనీవాసులు అందరూ కలసి మహిళా సంక్షేమ సంఘం నూతన భవనాన్ని బుధవారం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని చేపట్టారు. ముందుగా సంఘ అధ్యక్షురాలు నాగమ్మ రిబ్బన్ కటింగ్ చేసి నూతన భవనాన్ని ప్రారంభించారు. అనంతరం పూజలు నిర్వహించి కాలనీ వాసులకు అందుబాటులోకి తెచ్చారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ డాక్ యార్డ్ కాలనీలో సామాజిక భవన నిర్మాణానికి కాలనీ వాసుల అందరి సహకారం మరువలేనిదని, వారందరి కృషితో నేడు ఈ భవన నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభించడం జరిగిందని అన్నారు. ఈ భవనంలో డాక్ యార్డ్ కాలనీకి సంభందించిన సమావేశాలు, పెళ్లిళ్ల సమయంలో విడిది ఏర్పాటు, ప్రతి యేటా నిర్వహించే గ్రామ దేవత అయ్యిన పైడిమాంబ మహోత్సవాలు సందర్భంలో సామాన్ల భద్రత, ఇలా కాలనీ వాసుల అవసరానికి సంబంధించిన కార్యక్రమాలకు ఉపయోగిస్తామని ఆమె తెలిపారు. నూతన భవన ప్రారంభం చేసిన సందర్భంగా సుమారు 2000 వేల మందికి అన్న సంతర్పణ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పైడిమాంబ మహిళా సంక్షేమ సంఘం కమిటీ సభ్యులు ఉపాధ్యక్షులు ఎన్.త్రినాధ్ రెడ్డి, గౌరవాధ్యక్షులు ఆర్.జగన్నాథం, వైస్ ప్రెసిడెంట్ ఆదిలక్ష్మి, సెక్రెటరీ ఆర్ .నారాయణమ్మ, క్యాషియర్ ఎస్.పాపన్ము, సభ్యులు బుద్దమ్మ, యం. కుమారి, జి.భవాని, ఈశ్వరమ్మ, కాలనీ వాసులు పాల్గొన్నారు.

