భీమిలి పరిధి మందుబాబులకు సర్వీస్ శిక్ష విధించిన కోర్ట్.
మద్యం సేవించి వాహనం నడిపేవారికి బుద్ది చెప్పిన 15వ అదనపు మేజిస్ట్రేట్ జి విజయలక్ష్మి.
భీమిలి : పెన్ షాట్ ప్రతినిధి : డిసెంబర్ 05
బీమిలి ట్రాఫిక్ పోలీసు స్టేషన్ పరిధిలో మధ్యం తాగి వాహనం నడుపుతున్న 121 మందిని బీమిలి కోర్టులో హాజరు పరచగా 15 వ .అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ జి. విజయ లక్ష్మి ఒక్కొక్కరికి 1000 రూపాయలు జరిమానాతో పాటు కమ్యూనిటీ సర్వీసు క్రింద బీచ్ రోడ్డులో ఉన్న కోకొనట్ పార్కు, సెయింట్ ఆన్స్ ఉన్నత పాఠశాల మరియు ట్రాఫిక్ పొలీస్ స్టేషన్ పరిసరాలు శుభ్రం చెయ్యాలని ఆదేశాలు జారీ చెయ్యటంతో మందుబాబులు తదితర పరిసరాలను శుభ్రం చేసారు. ఆదేశాలను దిక్కరిస్తే జైలుకి పంపాలని మేజిస్ట్రేట్ జయలక్ష్మి ఉత్తర్వులు జారీ చేసారు.

