గిడిజాల,శీర్లపాలెం పంచాయితీలో వికసిత్ భారత్ కార్యక్రమం

 గిడిజాల,శీర్లపాలెం పంచాయితీలో వికసిత్ భారత్ కార్యక్రమం                         

 ఆనందపురం: పెన్ షాట్ ప్రతినిధి : డిసెంబర్ 05 :  

ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం చేపట్టిన వికసిత్ భారత్ కార్యక్రమం మంగళవారం భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలం,గిడిజాల,శీర్లపాలెం పంచాయితీలో కేంధ్ర ప్రభుత్వ పథకాలు అయిన గరిబ్ కల్యాణ్ అన్న యోజన,పిఎం అవాస్ యోజన,కిసాన్ సమ్మాన్ నిధి,ఉజ్జ్వల యోజన,అయుష్మాన్ భారత్,విశ్వకర్మ యోజన,జల్ జీవన్ మిషన్,కిసాన్ క్రెడిట్ కార్డులు, జన్ ధన్ యోజన,పిఎం స్వనిధి, నారీ శక్తి వందన్ అధినియమ్, ఎన్.ఈ.పి (జాతీయ విధ్యా విదానం), స్కిల్ ఇండియా మిషన్, స్వచ్ భారత్ మిషన్,NLM (నేషనల్ లైవ్ స్టాక్ మిషన్) పథకాలపై అవగాహన కల్పించారు.  గ్రామ పంచాయతీ కార్యదర్శి పి. రామారావు అధ్యక్షతన జరిగిన సభలో కేంద్ర ప్రభుత్వం పథకాల యొక్క ప్రాధాన్యతను వివరిస్తూ పంచాయితీలో కేంద్ర ప్రభుత్వ పధకాల లబ్ధిదారులతో మాట్లాడించారు.ఈ కార్యక్రమంలో గిడిజాల గ్రామ సర్పంచ్,సీనాగం అప్పలరాజు, వైస్.ఎంపీపీ పాండ్రంగి శీను,శి ర్లపాలెం గ్రామ సర్పంచ్,శిర్ల అప్పలనాయుడు,ఉప సర్పంచ్, గుసిడి అప్పల రాజు బీజేపీ జిల్లా కిసాన్ మోర్చ అధ్యక్షులు పి.వి.వి ప్రసాదరావు పట్నాయక్,మండల పార్టీ అధ్యక్షులు మీసాల రామునాయుడు,అసెంబ్లీ కన్వీనర్ కె.రామ నాయుడు బిజెపి నాయకులు భారత్ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ ఎం.నరేష్ కుమార్ బిజేపి నాయకులు పాండ్రంగి గోవిందా,నిమ్మకాయల అప్పలరాజు,మరియు లబ్ధిదారులు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.