ఆపదలో ఉన్న ఆటో డ్రైవర్ కి రాగాల భాస్కర్ రెడ్డి సహాయం.
గాజువాక : పెన్ షాట్ ప్రతినిధి : డిసెంబర్ 04:
రాగాల భాస్కర్ రెడ్డి ఆర్ధిక సహాయం తో...ఏ ఎన్ ఆర్ హెల్పింగ్ హాండ్స్ ఆధ్వర్యంలో
65వ వార్డ్ కార్పొరేట్ అభ్యర్థి అయిన రెయ్య రత్నం చేతులు మీదగా సుంకర ఈశ్వర్ రావు కి 2నెలలు సరిపడే నిత్యావసర సరుకులు అందచేయడం జరిగింది. తన`కుటుంబ జీవనోపాధి కోసం డైలీ ఆటో నడుపుతున్న సుంకర ఈశ్వర్ రావుకి నరాలు ఇన్ఫెక్షన్ వళ్లన బ్లడ్ బ్లాక్ అయిపోవడం తో . డాక్టర్స్ నరాలు రక్త ప్రశరణ కోసం చేతిలో నుండి ఒక నరంను బొడ్డులోకి లింక్ చేయడం వలన ప్రతీ 2రోజులుకి డ్రస్సింగ్ చేయవల్సి వస్తుంది అని విషయాన్ని ఏ ఎన్ ఆర్ హెల్పింగ్ హాండ్స్ స్యభ్యుడు తిలక్ కి తెలియ చేయగానే వెంటనే స్పందించి ఏ ఎన్ ఆర్ హెల్పింగ్ హాండ్స్ బృందం ముందుకు వచ్చారు.ఈ కార్యక్రమం లో నాయకులు సాడి రామారావు, పలపాల కనకేశ్వరరావు, శ్రీనివాసు ,శంకర్ కామేసు,సాయి, రంజిత్,సత్తిబాబు, ఏ ఎన్ ఆర్ హెల్పింగ్ హాండ్స్ సభ్యులు పాల్గొన్నారు.


