చంద్రంపాలెంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగనన్నే ఎందుకు కావాలంటే కార్యక్రమం.
మధురవాడ వి న్యూస్ ప్రతినిధి 2023 డిసెంబర్ 04:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి మళ్ళీ ఈ రాష్టానికి ముఖ్యమంత్రిగా ఎందుకు కావాలంటే అనే కార్యక్రమం జివియంసి జోన్ టు *7వ* *వార్డు* 59వ సచివాలయం పరిధి చంద్రంపాలెంలో వైస్సార్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగింది, మొదట పార్టీ నాయకులు వైస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించారు, అనంతరం నాలుగున్నర సంవత్సరాలలో 59వ సచివాలయానికి సంబందించిన అమలు పరచిన అభివృద్ధి, సంక్షేమ పధకాల బోర్డును ఓపెన్ చేసి అనంతరం సమావేశం ఏర్పాటు చేసి వక్తలు మాట్లాడుతూ 2019 జగన్మోహన్ రెడ్డి ఈ రాష్టానికి సీఎం అయినా తరువాత ప్రజా అవసరాలు అనుగుణంగా అభివృద్ధి, సంక్షేమ పధకాలు ప్రవేశ పెట్టి మొదటి సంవత్సరంలోనే అమలు చేసారని రాష్ట్ర ప్రజలు సంతోషమే మా ప్రభుత్వ ద్యేయమని ఇదే జగన్మోహన్ రెడ్డి ద్యేయమని కొనియాడారు , సచివాలయం వ్యవస్థ , వాలంటీర్ వ్యవస్థ పెట్టి సుమారు 4లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారు, ఈ సచివాలయం వ్యవస్థ ద్వారా ప్రజా ముంగిటకే వచ్చి పరిపాలన జరిపించడం జరిగిందన్నారు, ప్రతీ నెల ఒకటో తేది ఉదయం 5గంటలకే పెంక్షన్ అందించడం, ప్రతీ ఇంటి ముందుకే రేషన్ అందించడం, నాడు నేడు పధకం ద్వారా ప్రవేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాల తయారు చేయించారు, పేదవాడు కూడా ఇంగ్లీష్ మీడియం లో చదవాలని ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టారు , అమ్మ ఒడి, ఉన్నత చదువులకు పూర్తి పీజు రియాంబర్స్మెంట్, ఇల్లు లేని ప్రతీ ఒక్కరికి ఇల్లు స్థలం, ఇళ్ల నిర్మాణం, ప్రవేట్ హాస్పిటల్ ధీటుగా ప్రతీ వార్డ్ మండల పరిధిలో యూపీహెచ్ లు ఏర్పాటు చేసి డాక్టర్స్ ని పెట్టి ప్రజలకు సేవలు అందిస్తున్నారని కొనియాడారు, ఆరోగ్యశ్రీ, డ్వాక్రా రుణ మాఫీ, చేయూత, రైతు భరోసా, సమగ్ర భూసర్వే, వాహన మిత్ర, ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా పధకాలు ఉన్నాయన్నారు, ఈ పదాకాలు అన్నీ మరల కొనసాగాలంటే ఈ రాష్టానికి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం కావల్సిందేనన్నారు, రానున్న ఎన్నికల్లో మన భీమిలి శాసన సభ్యులు ముట్టంశెట్టి శ్రీనివాసరావుకి ఫ్యాన్ గుర్తు పై ఓటు వేసి గెలిపిస్తే రాష్టంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని కొనియాడారు, ఈ కార్యక్రమం లో సింహాచలం దేవస్థానం సభ్యులు పిళ్ళా కృష్ణ మూర్తి పాత్రుడు, విశాఖ జిల్లా వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పిళ్ళా సూరిబాబు, 7 వ వార్డు మహిళా అధ్యక్షురాలు చేకూరి రజని, వైస్సార్ పార్టీ నాయకులు పి.వి. జి.అప్పారావు పిళ్ళా అప్పన్న, జగుపిళ్లి నరేష్, పీస రామారావు, జగుపిళ్లి అప్పారావు, పోతిన జోగి, గూడేల రాజు, పోతిన కనకరావు, గరే నాగేశ్వరావు, బి.అశోక్, వి.అప్పారావు, నాగోతి రాజు, కేశనకుర్తి అప్పారావు, దుక్క అప్పారావు, పోతిన గురునాద్ కన్వీనర్లు, గృహ సారధులు, తదితరులు పాల్గొన్నారు.
