లాసెట్ ఎంట్రెన్స్, పరీక్షలో 39వ ర్యాంక్ సాదించిన వబలరెడ్డి భాగ్యలక్ష్మి

లాసెట్ ఎంట్రెన్స్, పరీక్షలో 39వ ర్యాంక్ సాదించిన వబలరెడ్డి భాగ్యలక్ష్మి

భాగ్యలక్ష్మి కి పలువురు అభినందనలు

మాడుగుల వి న్యూస్ 2023 డిసెంబర్ 04: 

వబలరెడ్డి భాగ్యలక్ష్మి ఎందరికో ఆదర్శం. ఆమె గృహిణిగా ఉంటూ ఓపక్క మాడుగుల విజ్ఞాన్ పాఠశాల లో విద్యార్థులకు విద్యను అందిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల మంది పాల్గన్న లా సెట్ ఎంట్రెన్స్, పరీక్ష రాసి 39వ ర్యాంక్ సాధించడం తో భాగ్యలక్ష్మి భర్త మాడుగుల దస్తావేజు లేఖరి నరసింగ రావుతో పాటు పలువురు అభినందనలు తెలియజేస్తున్నారు. భాగ్యలక్ష్మి పదో తరగతి వరకు మాడుగుల ఆర్ సి ఎమ్ పాఠశాల, అనంతరం ఇంటర్మీడియట్ డిగ్రీ ఎస్. కోటలో చదువుకున్నారు. సాధారణ గృహిణిగా ఉంటూ 39 ర్యాంక్ సాధించడంపై భాగ్యలక్ష్మి అన్నయ్య చోడవరం దస్తావేజు లేఖరి బొబ్బిలి చంద్రశేఖర్,పలువురు అభినందనలు తెలియజేస్తున్నారు.