భారతీయ జనతా పార్టీ 3 రాష్ట్రాల్లో విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం

భారతీయ జనతా పార్టీ 3 రాష్ట్రాల్లో విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం:-

ఆనందపురం : వి న్యూస్ : డిసెంబర్ 04:

విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలంలో వెల్లంకి బిజేపి పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షులు మీసాల రాము నాయుడు ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ రాజస్థాన్,మధ్యప్రదేశ్,ఛత్తీస్గడ్ అసెంబ్లీ ఎన్నికలు విజయం సాధించినందుకు, బిజెపి కార్యకర్తల్లో ఉత్సాహం పెరిగింది అని అన్నారు.ఈ సందర్భంగా బిజేపి నాయకులు కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు,బాణసంచా కాలుస్తూ మిఠాయిలు పంచిపెట్టారు.ఈ కార్యక్రమo ను ఉద్దేశించి విశాఖ జిల్లా కిసాన్ మోర్చ అధ్యక్షులు పి.వి.వి.ప్రసాదరావు పట్నాయక్ మాట్లాడుతూ తాజా విజయాలతో భారతీయ జనతా పార్టీ మన దేశంలో 12 రాష్ట్రాలకు విస్తరించింది, అని కాంగ్రెస్ పార్టీ తెలంగాణతో కలిపి, కేవలం మూడు రాష్ట్రాలకే పరిమితం అయిందని,తెలంగాణలో భారతీయ జనతా పార్టీ,గతంలో కంటే,14% శాతం ఓటు బ్యాంకు పెరిగిందని,రెండు తెలుగు రాష్ట్రాల్లో రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని వ్యాఖ్యానించారు.ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ఉప్పాడ అప్పారావు,జిల్ల కిసాన్ మోర్ఛ కార్యదర్శి బుత్తల రాజు బిజేపి మండల ఉపాధ్యక్షులు,పి.సాయి రమేశ్,బోర శ్రీను పి.చిన్న రావు,ప్రధాన కార్యదర్శిలు:- కె.వి.వి.సూర్యనారాయణ,బoకసీతంనాయుడు,మండలఎస్సీమోర్చ అధ్యక్షులు,ఇంటిసత్తిరాజు,ఉప్పాడ శివ పొన్నాడ గురయ్యే పాల్గొన్నారు.