స్వయం శుభ్రత పాటించడం వలన మాత్రమే వ్యాధులు దరికి చేరవు
ఫ్రైడే-డ్రైడే కార్యక్రమం లో 5 వ వార్డ్ కార్పొరేటర్ మొల్లి హేమలత
మధురవాడ : వి న్యూస్ : డిసెంబర్ 01:
మధురవాడ: 5 వ వార్డ్ పరిధి శివశక్తి నగర్ కాలనీలో జి వి ఎం సి మలేరియా డిపార్ట్మెంట్ ఇన్స్పెక్టర్ మంగరాజు ఆధ్వర్యంలో ఫ్రైడే - డ్రైడే కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో ముఖ్య అదితిగా పాల్గొన్న 5వార్డ్ కార్పొరేటర్ మొల్లి హేమలత మాట్లాడుతూ ప్రజలందరూ స్వయం శుభ్రత పాటించాలని, అలా పాటించడం వలన ఎలాంటి అంటువ్యాధులు మన దరికి చేరవని తెలియజేశారు. ముఖ్యంగా మన ఇంట్లో నీరు ఎక్కువ కాలం నిల్వ ఉండకుండా చూసుకోవాలని, పూల కుండీల్లో,ఫ్రిడ్జ్ వెనకవైపు మరియు మనం నిత్యం వాడే పాత్రల్లో, నీటి డ్రమ్ముల్లోనూ, వాహనాల టైర్ల లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, అలాగే మన చుట్టూ ఉన్న పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం కార్పొరేటర్ వార్డులో పర్యటించి పారిశుద్ధ్య సమస్య ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి వెంటనే సంబంధిత అధికారుల ద్వారా ఆ సమస్యను పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు మొల్లి లక్ష్మణరావు, కాలనీ పెద్దలు సరస్వతి, నారాయణరావు, అన్నేపు రమణమూర్తి, జీవీఎంసీ మలేరియా డిపార్ట్మెంట్ మేరీ మనీ,నాయుడు,రాధిక,వాసు శానటరీ ఇన్స్పెక్టర్ సంతోష్, సచివాలయ సిబ్బంది లోకేష్, జీవీఎంసీ సిబ్బంది వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.

