బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జోన్ టు జోనల్ కమిషనర్
మధురవాడ : వి న్యూస్ 2023 డిసెంబర్ 06:
భారత రాజ్యాంగ పితామహుడు డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ వర్ధంతి . ఈ రోజును మహాపరినిర్వాన్ దివాస్‌గా కూడా పాటిస్తారు అని జోనల్ కమిషనర్ కె. కనక మహాలక్ష్మి కొనియాడారు. ,జీవీఎంసీ జోన్ టు పరిధిలోని 6వ వార్డ్ జీవీఎంసీ జోన్ టు కార్యాలయం ఎదుట ఉన్న బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ మాట్లాడుతూ .బాబా సాహెబ్ అంబేద్కర్ ప్రధాన సంఘ సంస్కర్తలలో ఒకరిగా పరిగణించబడ్డాడు.భారతదేశ ప్రగతిశీల దృక్పథాన్ని రూపొందించడంలో ఆయన గొప్ప సహకారం అందించారు. సామాజిక వివక్షకు వ్యతిరేకంగా పోరాడారు.డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 'నేను హిందువుగా చనిపోను' అనే తన ప్రకటనను నెరవేర్చి బౌద్ధమతం స్వీకరించిన తర్వాత డిసెంబర్ 6, 1956న తుది శ్వాస విడిచారు. డాక్టర్ అంబేద్కర్ చదువుకునే రోజుల్లో దళితుడిగా వివక్షకు గురయ్యారని, దానికి వ్యతిరేకంగా పోరాడేందుకు అప్పట్లోనే ఆయనలో బీజం పడింది.అతను ఇతర అగ్ర కులాల మాదిరిగానే దళితుల తాగునీటి వనరులను ఉపయోగించుకునే హక్కుల కోసం పోరాడాడు, అంటరానివారికి దేవాలయాలలోకి ప్రవేశించే హక్కుల కోసం హిందూ బ్రాహ్మణులకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం వంటి చిన్న విషయాల నుండి అతను ప్రశ్నలను లేవనెత్తాడు.అని ఆయన గొప్పతనం గురించి తెలిపారు...ఈ కార్యక్రమంలో జీవీఎంసీ జోన్ టు సిబ్బంది పాల్గొన్నారు....

