మధురవాడ జోన్ టూ లో అడ్డగోలుగా అనధికార కమర్షియల్ దందా..

మధురవాడ జోన్ టూ లో అడ్డగోలుగా అనధికార కమర్షియల్ దందా....

మధురవాడ: వి న్యూస్ ప్రతినిధి: డిసెంబర్06 :

క్రమ క్రమంగా జాతీయ రహదారులను సైతం వొదలని కబ్జా దారులు...

మౌనం వహిస్తున్న జోన్ టూ టౌన్ ప్లానింగ్,శానిటేషన్ అధికారులు....

వివరాలు లోకి వెళితే....మధురవాడ జోన్ టూ కార్యాలయానికి కుత వేటు దూరంలో ఉన్న పిఎం పాలెం రోడ్డులో వేదాంత హాస్పిటల్ ఎదురుగా దర్జాగా అనధికార నిర్మాణం చేపట్టిన జి వి ఎం సి అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. జాతీయ రహదారులను సైతం వొదలకుండ రోడ్డు మీదకి కమర్షియల్ నిర్మాణాలను నిర్మిస్తున్నారు. జి వి ఎం సి నుండి రెసిడెన్షియల్ అనుమతులు తీసుకుని కమర్షియల్ నిర్మాణాలు చేపడుతున్నారు.  దర్జాగా రోడ్డు మీదకి  కమర్షియల్ షాప్ లను ముందుకు పెంచుకుంటూ అనధికార నిర్మాణం చేపడుతున్నారు. అయినప్పటికీ జి వి ఎం సి అధికారులు కాసుల కక్కుర్తి పడి వారిపై జీవీఎంసీ అధికారులు ఏటువంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తంచేశారు.