జోన్-2 ఆఫీస్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన ఆరవ వార్డు ఎస్సీ సెల్ అధ్యక్షులు జామి శివ: నియోజకవర్గం వై.ఎస్.ఆర్.పి ఎస్సీ సెల్ ఇంచార్జ్ కనకరాజు సియ్యాద్రి
మధురవాడ : వి న్యూస్ ప్రతినిధి: డిసెంబర్06 :
భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆరవ వార్డు కార్పొరేటర్ మరియు జీవీఎంసీ చీఫ్ విప్ డాక్టర్ మొత్తం శెట్టి ప్రియాంక ఆదేశాల మేరకు ఆరవ వార్డు ఎస్సీ సెల్ అధ్యక్షులు జామి శివ ఆధ్వర్యంలో మధురవాడ జీవీఎంసీ జోన్-2 ఆఫీస్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భీమిలి నియోజకవర్గం వై.ఎస్.ఆర్.పి ఎస్సీ సెల్ ఇంచార్జ్ కనకరాజు సియ్యాద్రి మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ మన మధ్యలో లేకపోయినా ఆయన ఆలోచన విధానం ఈ దేశానికి శరణ్యమని ఆయన రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజులు శ్రమించి రాసినటువంటి భారత రాజ్యాంగం రూపంలో స్థిరస్థాయిగా నిలిచే ఉంటారని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన నివాళులు అర్పించడం చాలా ఆనందదాయకమని ఆయన మార్గంలో నడిచేలా జ్ఞానాన్ని ప్రసాదించమని అంబేద్కర్ ని ఎల్లప్పుడూ స్మరించుకోవాలని అన్నారు. అంబేద్కర్ ని కొన్ని కులాలకే పరిమితం చేస్తున్నారని ఏ ఒక్క కులాలకు ప్రాంతాలకు ఆయన స్ఫూర్తిదాయకం కాదని ఈ దేశం నలుమూలలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆయన కీర్తించబడుతున్నారని ఆ మహానుభావుడు కొందరువాడు కాదు అందరివాడు అని భారత దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కు ఆయన పట్ల సమాన హక్కు ఉంటుందని అన్నారు. రిజర్వేషన్ ఫలాలు అనుభవించిన వారు కూడా ఆ మహానుభావుడిని స్మరించుకోకపోవడం చాలా బాధాకరం అని ఆ జ్ఞానాన్ని వారు సంపాదించుకోలేకపోయారని ఇంకా అజ్ఞానంలో బతుకుతున్నారని అన్నారు. గాద రోసిరెడ్డి మాట్లాడుతూ ఇక్కడికి వచ్చి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ప్రతి ఒక్కరూ జ్ఞానవంతులని కుల మతాలుకు అతీతంగా వచ్చిన వారందరికీ ధన్యవాదాలు మీరే నిజమైన అంబేద్కర్ వారసులని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆరవ వార్డు అధ్యక్షులు బొట్ట అప్పలరాజు , గౌరవ అధ్యక్షులు డాక్టర్ గాదే రోసిరెడ్డి , ఐదవ వార్డు జేసిఎస్ కన్వీనర్ పోతున్న సురేష్, గుంటుబోయిన సంజీవ్ యాదవ్, రాయన సాయి , పిల్లా రమణ బాబు, బెల్లాన ప్రసాద్, s.అప్పలరాజు, సూరి అప్పారావు, ముచ్చు రామారావు, ఉండ రమణ, పోతన నర్సింగరావు, శ్రీనివాస్ రెడ్డి, అప్పారావు, లోకేష్, అనూష, తదితరులు పాల్గొన్నారు.

