5వవార్డ్ పరిధిలో ముసురు తెచ్చిన ముప్పు

5వవార్డ్ పరిధిలో ముసురు తెచ్చిన ముప్పు.

మధురవాడ : వి న్యూస్ : డిసెంబర్ 06

మధురవాడ: బంగాళాఖాతంలో ఏర్పడిన మిఛాంగ్ తుఫాన్ వలన జీవీఎంసీ జోన్-2 మధురవాడ 5వ వార్డ్ పరిధిలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో కార్పొరేటర్ మొల్లిహేమలత ఆదేశాలతో ఆమె తండ్రి టిడిపి రాష్ట్ర బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి మొల్లిలక్ష్మణరావు పర్యటించారు.మారికవలస జంక్షన్ శారదనగర్ లో పల్లా గోపాలం చిన్నమ్మలు,సాకేటి కృష్ణ పుష్ప, వారికి చెందిన నివాస గృహాలు కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాల కారణంగా క్రింద మట్టి తొలచుకుని పోయి కూలడానికి సిద్ధంగా ఉంది,పై వరుసలో ఉండే గృహాలు క్రింది వరుసలో ఉండే నివాసాలపై పడే పరిస్థితి నెలకొంది.ముఖ్యంగా అక్కడ నివాసాలు ఉంటున్న ప్రాంతం కొండవాలు ప్రదేశం అవ్వడం కారణంగా పడుతున్న భారీ వర్షానికి మట్టి క్రిందికి జారిపోవడం జరిగింది.ఈ విషయాన్ని కార్పొరేటర్ మొల్లి హేమలత జీవీఎంసీ అధికారులకు తెలియపరచగా... జి.వి.ఎమ్.సి పబ్లిక్ వర్క్స్ ఈ.ఈ.శాంతి రాజు,వర్క్ ఇన్స్పెక్టర్ అప్పలరెడ్డి,వి.ఆర్. ఓ.పూర్ణ,సచివాలయ సెక్రటరీలు బుధవారం ఆప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని చూసారు.సత్వరచర్యలు చేపట్టడంలో భాగంగా ముందుగా కొండచర్యలు జారిన చోట రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపడతామని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్,అధికారులు తెలిపారు.వర్షాలు విపరీతంగా కురుస్తున్న కారణంగా ఏ సమయంలోనైనా ప్రమాదం జరగవచ్చునని తెలిపారు. ప్రస్తుతం అక్కడ నివాసం ఉంటున్న వారు సురక్షిత స్థలాలకు వెళ్లాలని కోరారు. ఈపర్యవేక్షణలో మొల్లి లక్ష్మణరావు,ఆనందరావు, దేవర శివ,భారతి సచివాలయ ఎమ్యూనిటీ సెక్రటరీలు, తదితరులు పాల్గొన్నారు.