అనాధ వృద్ద మహిళ మృతి; అంతిమ సంస్కారం చేసిన ముస్లిం సోదరులు

అనాధ వృద్ద మహిళ మృతి; అంతిమ సంస్కారం చేసిన ముస్లిం సోదరులు.

అమలాపురం (వి న్యూస్ ప్రతినిధి) డిసెంబర్ 2023;

అమలాపురం తహశీల్దార్ కార్యాలయం ఎదురుగా పార్కులో మంగళ వారం ఉదయం ఒక వృద్ద మహిళా మృతి చెందింది. పోలీసులకు,మున్సిపల్ కార్యాలయానికి వైసిపి నాయకులు ఒంటెద్దు వెంకన్ననాయుడు, కల్వకొలను బాబిలు కు సమాచారం అందించారు.సంఘటన స్థలానికి పోలీసులు,మున్సిపల్ సిబ్బంది చేరుకున్నారు.దహన సంస్కారాలు చేసేందుకు సిద్ధపడ్డ మున్సిపల్ సిబ్బంది.కాసేపటి తర్వాత సంఘటన స్థలానికి చేరుకున్న ముస్లిం పెద్దలు.అంత్యక్రియలు చేస్తామని ముస్లిం పెద్దలు తెలిపినట్లు నాయుడు తెలిపారు. మృతురాలి తరుపు బంధువులు ఎవరు రాకపోయినా ఆచారం ప్రకారం దహన సంస్కారాలు చేసేందుకు ముందుకు వచ్చి ముస్లిం పెద్దలు మానవత్వాన్ని చాటుకున్నారు. అనాధ మహిళకు ముస్లిం సోదరులు అంతా కలిసి అంతక్రియలు చేశారు. ఈ కార్యక్రమంలో వైయస్సార్ పార్టీ నాయకులు, సంఘ సేవకులు ఒంటెద్దు వెంకన్న నాయుడు, నాగ మానస, కరిముల్లా బాబా, షరీఫ్, లింగోలు ,పండు, బషీర్, చాగంటి ప్రసాద్ తో పాటు మరికొందరు సామాజిక సేవా కార్యకర్తలు పాల్గొన్నారు.