భీమిలి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి సిద్దమైన: నాగోతి. నాగమణి
మధురవాడ : వి న్యూస్ : డిసెంబర్ 25:
మహిళలను చులకనగా చూస్తున్న కొన్ని దేశాలతో పోలిస్తే భారతదేశం ఎంతో ప్రతిష్టాత్మక మైందని అన్నారు. మహిళలు వంటింటికే కాకుండా అన్ని రంగాల్లో ముందుకు వెళ్లాలంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాజ్యాంగంలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించడం చాలా ఆనందంగా ఉంది అని భీమిలి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా పోటి చేస్తున్న నాగోతి. నాగమణి.జీవీఎంసీ జోన్ టు పరిధిలోని 7వ వార్డ్ పాత పోతినమళ్ళయ్యపాలెంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటి చేస్తున్న నాగోతి. నాగమణి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాగమణి మాట్లాడుతూ మహిళలకు చట్ట సభలో ప్రవేశ పెట్టిన మహిళలకు కేటాయించిన రిజర్వేషన్లు ప్రకారం ప్రజల సమస్యలపై పోరాటం చేయటానికి రాబోయే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న అని తెలిపారు . గెలిచిన తర్వాత మధురవాడలో ఉన్న డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరిస్తానని,అలాగే సింహాచలం పంచ గ్రామాల భూ సమస్యలపై, యువతకు నిరుద్యోగ సమస్యపై నా వంతు పోరాడతానని అన్నారు, వారి అర్హత బట్టి తగిన ఉపాధి పొందేలా చూస్తాను అని తెలిపారు.