భీమిలి:విశాఖ లోకల్ న్యూస్
అభిమానుల ఆధ్వర్యంలో గాడు.వెంకటప్పడు జన్మదిన వేడుకలు
డి.ఎల్ డి.ఏ చైర్మన్ గాడు.వెంకటప్పడు పుట్టిన రోజు వేడుకలు మండలం లో ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలుసేవా కార్యక్రమాలుకి శ్రీ కారం చుట్టారు. అందులో భాగంగానే తగరపువలస అంబేద్కర్ జంక్షన్ కూడలి లో సాయిరాం కుకింగ్ & కేటరింగ్ ప్రొ"టి.పి రాజు ఆద్వర్యంలో సుమారు 500 మంది పేదలకు అన్నదానం ఏర్పాటు చేసారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా భీమునిపట్నం సబ్ ఇన్స్పెక్టర్ సంతోష్ ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ చిరంజీవి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమం లో నీలాపు సూర్య నారాయణ ,గాడు అప్పలనాయుడు, మాకాల వెంకట అప్పారావు, సురాల వెంకట రావు ,కనకల త్రినాద్ మరియు ఆయన అభిమానులు పాల్గున్నారు!

