22వ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ నిరాహార దీక్షకి మద్దతుగా ఆమ్ ఆద్మీ పార్టీ.

  22వ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ నిరాహార దీక్ష కి మద్దతుగా ఆమ్ ఆద్మీ పార్టీ.

విశాఖ లోకల్ న్యూస్:

జీవీఎంసీ జోనల్ 3 ఆఫీస్ నందు జనసేన పార్టీ 22వ జీవియంసి కార్పొరేటర్  పీతల మూర్తి యాదవ్  ప్రభుత్వం 22వ వార్డులో చేస్తున్న అన్యాయంపై (రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇల్లు పట్టాల పంపిణీ కార్యక్రమంలో పీతల మూర్తి యాదవ్ పేరు లేకపోవడం ప్రోటోకాల్ సంబంధం లేనటువంటి వ్యక్తులతో ఇళ్లపట్టల పంపిణీ కార్యక్రమం చేపట్టడం దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ) గడిచి 24 గంటలుగా జరుగుతున్న  నిరాహార దీక్షగా మద్దతుగా ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతు పలకటం జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర స్టేట్ ఉమెన్ కన్వీనర్ డాక్టర్ శీతల్ మదన్, ఉత్తరాంధ్ర ఇన్చార్జ్ సీరా రమేష్ కుమార్, వైజాగ్ ఈస్ట్ నియోజకవర్గ కన్వీనర్ సాయిరాం, భీమిలి నియోజకవర్గం భాస్కర్, డివి లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.