పి ఎం పాలెం శ్రీ హెల్పాల్ అసోసియేషన్, పి ఎం పాలెం శిష్టకరణ సేవా సంఘం ఆధ్వర్యంలో బాలల దినోత్సవo

పి ఎం పాలెం శ్రీ హెల్పాల్ అసోసియేషన్, పి ఎం పాలెం శిష్టకరణ సేవా సంఘం  ఆధ్వర్యంలో బాలల దినోత్సవo.

పి ఎం పాలెం: వి న్యూస్ :నవంబర్ 14: 

విశాఖపట్నం* పీఎం పాలెం శ్రీ హెల్పాల్ అసోసియేషన్, పి ఎం పాలెం శిష్టకరణ సేవా సంఘం ఆధ్వర్యంలో బాలల దినోత్సవo. పీఎంపాలెం : పెన్ షాట్ ప్రతినిధి : నవంబర్ 14 *విశాఖపట్నం* పీఎం పాలెం శ్రీ హెల్పాల్ అసోసియేషన్, పి ఎం పాలెం శిష్టకరణ సేవా సంఘం ఆధ్వర్యంలో బాలల దినోత్సవo ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక అతిధులుగా ప్రముఖ బ్యూటిషన్ బి ప్రమీల, జి జి రామారావు మరియు

అధ్యక్షులు లయన్ డొంకాడ అనిల్ కుమార్ లు ప్రసంగిస్తూ నేటి బాలలను భవిష్యత్ లో ఉన్నత పౌరులుగా తీర్చి దిద్దేందుకు విద్యార్థి దశలోనే బాటలు వేయాలన్నారు. విద్యార్థులకు ఒత్తిడి లేని విద్యను అందించాలన్నారు. విద్యాబుద్ధులు నేర్పడంతో పాటు ఆటపాటల పట్ల చిన్నారులకు ఆసక్తి కలిగించడం ద్వారా మానసిక వికాసంతో విద్యను అభ్యసిస్తారని పేర్కొన్నారు. పిల్లల దినోత్సవం సందర్బంగా చిన్నారులకు వివిధ పోటీలు నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈకార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి మండవకురిటి లక్ష్మి, ఉపాధ్యక్షురాలు పాడి కనకమహాలక్ష్మి,, సహాయక కార్యదర్శి దుర్గాదేవి భవాని, సభ్యులు మేరీ రమ్య, పొట్నూరు కుశుబు, సతీ పార్వతి, డొంకాడ వసంత, నమ్మి సంతోషి తదితరులు పాల్గొన్నారు.