ది ఐ స్కూల్ లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
ఆనందపురం: వి న్యూస్ ప్రతినిధి : నవంబర్ 14:
ఆనందపురం మండలం బంటుపల్లి కల్లాలు రోడ్లో ఉన్నటువంటి ది ఐ స్కూల్ ప్లే స్కూల్ లో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు నిర్వహించారు .
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జాతీయ క్రీడాకారులు స్కై మార్షల్ ఆర్ట్స్ 37 నేషనల్ గేమ్స్ విజేత పోతిన ప్రవీణ్, అంతర్జాతీయ రోలర్ స్కేటింగ్ విభాగంలో సిల్వర్ మెడల్ సాధించిన గొలగాని దినేష్, వృక్ష ఫౌండేషన్ అధ్యక్షులు,ది ఐ స్కూల్ డైరెక్టర్ కాకర సురేష్ కుమార్ పాల్గొన్నారు.
ఈ మధ్యకాలంలో జాతీయ అంతర్జాతీయ పోటీలలో గెలుపొందిన ఇద్దరు క్రీడాకారులకు మోమెంటో తో సన్మానించారు .
ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ భవిష్యత్తులో మరింత రాణించాలని ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు.
ఇప్పుడున్న యువతకు పిల్లలకు మీరంతా స్ఫూర్తిదాయకమని కొనియాడారు.
బాలల దినోత్సవ సందర్భంగా పిల్లలు అందరికీ ఆట పోటీల్లో గెలుపొందిన వారికి మెడల్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కుప్ప లహరి, స్కై మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి లెంక అప్పల రాము, వైస్ ప్రెసిడెంట్, బొద్దప్పు బంగారు రాజు, దినేష్, గొల్లగాని శ్రీను, ఉపాధ్యాయులు యువకులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

