భీమిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టిడిపి జనసేన నాయకుల ఆత్మీయ సమావేశం

 భీమిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టిడిపి జనసేన నాయకుల ఆత్మీయ సమావేశం .

భీమిలి : వి న్యూస్  ప్రతినిధి : నవంబర్ 14:

మంగళవారం భీమిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో భీమిలి నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ మరియు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ *కోరాడ రాజబాబు* అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకుల ఆత్మీయ సమ్మేళన సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో రెండు పార్టీల ఉమ్మడి కార్యచరణ రూపకల్పన చేస్తూ ఉమ్మడిగా రూపొందించిన మేనిఫెస్టో కరపత్రాలను ప్రదర్శిస్తూ చేయి చేయి కలిపి కలిసికట్టుగా వైఎస్ఆర్సిపి పార్టీని బంగాళాఖాతంలో కలపడానికి సిద్ధమని తెలియజేస్తూ పార్టీ నాయకులకు కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భీమిలి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ డాక్టర్ పంచకర్ల సందీప్, భీమిలి నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు కోట్ని బాలాజీ, రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు, విశాఖ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పాసర్ల ప్రసాద్, విశాఖ పార్లమెంట్ రైతు ప్రధాన కార్యదర్శి భీమిలి రూరల్ మండల పార్టీ అధ్యక్షులు డి ఏ ఎన్ రాజు, రాష్ట్ర వాణిద్య విభాగ ఉపాధ్యక్షులు కసిరెడ్డి దామోదర్ రావు, రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షులు గొల్లంగి ఆనంద్ బాబు, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు కురిమిన లీలావతి, తెలుగుదేశం జనసేన పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.