ఆక్స్ ఫర్డ్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం

ఆక్స్ ఫర్డ్ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం.

రాజమండ్రి: పెన్ షాట్ ప్రతినిధి : నవంబర్ 14: 

రాజమండ్రి ఏ వి రోడ్ స్థానిక తిలక్ రొడ్ లోని ఆక్స్ ఫర్డ్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల లో బాలల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ప్రముఖ వైద్యనిపుణులు డా. యస్. గౌతం రెడ్డి విచ్చేసినారు. విద్యార్థులు చిన్ననాటినుండే దృఢమైన ఆశయంతో చదవాలని , క్రమశిక్షణ అలవరుచుకోవాలని , పోటితత్వాన్ని పెంపొందించు కోవాలని తెలిపారు. 

ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పాఠశాల ఆవరణ అంతా రంగు రంగుల బెలూన్ల తో అలంకరించారు. ఈ కార్యక్రమంలో పాటశాల ప్రిన్సిపాల్ ఐ. వి. సుధాకర్, ఇంచార్జిలు ఉషామాధురి , నాగమణి, కమల, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.