విశాఖ: ఇంటర్ విద్యార్థి బలవన్మరణం.
కొమ్మాది: వి న్యూస్ ప్రతినిధి : నవంబర్ 14:
విశాఖ మధురవాడ కొమ్మాదిలో ఇంటర్ విద్యార్థి గుర్రం శ్రావణి తులసి(16)
బలవన్మరణం తో మృతి.
తన నివాసంలో తెల్లవారుజామున 3 గంటల సమయంలో బలవన్మరణం చేసుకున్నట్లు తల్లిదండ్రులు గుర్తించారు.
బంధువుల అబ్బాయి భరత్ అనే యువకుడు వేధింపులు భరించలేక బలవన్మరణం చేసుకున్నట్లు పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

