భీమిలి నియోజకవర్గంలో రూరల్ మండలలు కరువు మండలాలుగా ప్రకటించాలి

భీమిలి నియోజకవర్గంలో రూరల్ మండలలు కరువు మండలాలుగా ప్రకటించాలి:-

విశాఖ జిల్లా కిసాన్ మోర్చ అధ్యక్షులు,పి.వి.వి. ప్రసాదరావు పట్నాయక్,

ఆనందపురం : వి న్యూస్  : నవంబర్ 13:

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అద్యక్షురాలు దగ్గు పాటి పురందరేశ్వరి సూచనమేరకు కిసాన్ మోర్చా రాష్ట్ర అద్యక్షలు చిగురు పాటికుమారస్వామి ఆదేశాలమేరకు,విశాఖ పార్లమెంట్ జిల్లాలో భీమిలి నియోజకవర్గo లో పద్మనాభం,ఆనందపురం, భీమిలి రూరల్ మండలాల్లోను కరవు మండలాలగా ప్రకటించాలి అని విశాఖ జిల్లా కిసాన్ మోర్చ డిమాండ్,ఈ సందర్భంగా విశాఖ జిల్లా కిసాన్ మోర్చ అధ్యక్షులు,పి.వి.వి. ప్రసాదరావు పట్నాయక్,ఆధ్వర్యంలో భీమిలి నియోజకవర్గంలో ఆనందపురం, పద్మనాభం,భీమిలి రూరల్ మండలంలో పర్యటించారు,ఈ సందర్భంగా,వరి పంటలను పరిశీలించి విశాఖ జిల్లా కిసాన్ మోర్చ అధ్యక్షులు పి.వి.వి. ప్రసాదరావు పట్నాయక్ మాట్లాడుతూ రైతన్నలు ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్లో వరి పంటలుకు గిట్టుబాటు ధర రావడంలేదని రైతులు కోరుతున్నారు. రైతులు కరువులో చిక్కుకున్నారనీ,కేంద్ర ప్రభుత్వం ఎరువులపై సబ్సిడీ,కిసాన్ సమృద్ధి కేంద్రంల ద్వారా రైతులకు భరోసా ఇచ్చిన,రైతులకు పెట్టుబడి కింద పిఎం కిసాన్ యోజన ద్వారా,సంవత్సరానికి 6000 నేరుగా రైతుల ఎకౌంటు లోకి,కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సాయం తప్పించి,రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఏమీ లేదని రైతులకు రాష్ట్ర ప్రభుత్వం,ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి,రైతులకు ఎటువంటి సాయం అందించలేదని కేంద్రం ఇచ్చిన పథకాల ద్వారా,రైతులకు,మేలు జరుగుతుంది తప్ప రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎటువంటి మేలు జరగలేదని దీనికి నిదర్శనమే మన రాష్ట్రంలో 679 మండలం ఉంటే రాష్ట్రంలో,450 మండలాల లో వర్ష బావ పరిస్థితిలు ఉంటే, జగన్ ప్రభుత్వం కరువు మండలాలు 103 మండలంలలో మాత్రమే వర్ష బావ పరిస్థితులు ఉన్నట్టు ప్రకటించింది,రైతులపై, రాష్ట్ర ప్రభుత్వంకి ఎంత శ్రద్ధ ఉందో, వ్యవసాయంపై ఆధారపడిన రైతులు ఎందరో ఉన్నారో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె తెలియని పరిస్థితిలో,మన రాష్ట్రం ఉందని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం, స్పందించి,కరువు మండలాల్లో వ్యవసాయ శాఖ మంత్రి పర్యటించి,450 మండలాలు కరువు మండలాలగా ప్రకటించాలని బిజేపి విశాఖ జిల్లా కిసాన్ మోర్చ డిమాండ్. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు,బిజేపి కిసాన్ మోర్చ నాయకులు,కలగళ్ల పేర్రాజు, సారిక ప్రకాశ్,బుత్తల రాజు,అనీల్ రాజు,తదితరులు పాల్గొన్నారు.