గోశాలగా మారిన జీవీఎంసీ ఏడో వార్డ్ స్వతంత్ర నగర్ పార్కు.
జీవీఎంసీ పార్కును పరిరక్షించడంలో విఫలమైన జీవీఎంసీ అధికారులు.
మధురవాడ : వి న్యూస్ : నవంబర్ 20:
ప్రజలకు ఆహ్లాధకర వాతావరణాన్ని అందించి మానసిక ఉల్లాసం, శరీరక దృఢత్వం పొందేందుకు ఎన్నో కోట్లు ఖర్చుపెట్టి జీవీఎంసీ ప్రభుత్వ పార్కులను ఏర్పాటు చేసి ఆరోగ్యమే మహాభాగ్యం అన్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా వ్యాయామశాల పరికరాలను ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వ పార్కులను పరిరక్షించే విషయంలో జీవీఎంసీ అధికారులు విఫలం అయ్యారని స్థానికులు విమర్శిస్తున్నారు. భీమిలి నియోజకవర్గంలో జీవీఎంసీ జోన్ టు పరిధిలోని 7వవార్డు స్వతంత్ర నగర్ పార్కులో కోట్లు ఖర్చుపెట్టి పార్కుని ఎంతో సుందరంగా తీర్చిదిద్దారు. అలాంటి పార్కులో మనుషులకు బదులు ఆవులు సేద తీరుతున్నాయి. చుట్టుపక్క ఉన్నవాళ్లు ఆవులను తీసుకొచ్చి ఆ పార్కుల్లో కట్టి వేస్తున్న సరే జీవీఎంసీ అధికారులు చూసి చూడనట్టు ఉండడం చాలా ఆశ్చర్యంగా ఉందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వ్యాయామం కొరకు పార్క్ కి వెల్దామంటే ఆవులు పార్కులో ఉండటంతో వెళ్ళ లేకపోతున్నామని అంటున్నారు. ప్రజలకు ఉపయోగపడాల్సిన పార్కులు ఇలాగా జంతువులకు ఉపయోగపడుతున్న దాన్ని చూసి అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారన్న దానిపై ప్రకృతి ప్రియులు ఆవేదన చెందుతున్నారు. వ్యాయామశాల పరికరాలు అమర్చి చివరకు దేనికి పనికిరాకుండా పోతున్న సరే అధికారులు పట్టించుకోవడం లేదు ప్రజా ప్రతినిధులు వచ్చినప్పుడు మాత్రం హడావుడి చేసే జీవీఎంసీ అధికారులు తర్వాత వాటిని కనీసం అటువైపు కూడా చూడడం లేదని స్థానిక వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జీవీఎంసీ అధికారులు వెంటనే స్పందించి పార్కులను పరిరక్షించే క్రమంలో ముందుండాలని స్థానికులు కోరుతున్నారు.


.jpeg)