పవన్ కళ్యాణ్ సీఎం కావాలని శివశక్తి నగర్ నుండి శబరిమలకి సైకిల్ యాత్రగా వెళ్తున్న జనసైనికులు.
మధురవాడ : పెన్ షాట్ ప్రతినిధి : నవంబర్ 21 :
విశాఖపట్నం మధురవాడ శివశక్తి నగర్ నుండి శబరిమల సైకిల్ యాత్రగా బయలుదేరామని నిశ్చయించుకున్న పవన్ కళ్యాణ్ సీఎంగా చూడాలని వేడుకొని ఈ . శ్రీను, డి . చందు, ఎన్ . రాజేష్ జనసేన పార్టీ నాయకులు బి టీ డి శ్రీకాంత్ రెడ్డి ని కలవడం జరిగింది. జనసేన పార్టీ భీమిలి నియోజకవర్గం ఇంచార్జ్ డాక్టర్ పంచకర్ల సందీప్ ఆదేశాల మేరకు నియోజకవర్గ నాయకులు నక్క శ్రీధర్ విషయాన్ని తెలుసుకొని తన వంతు సహాయంగా ఒక కొత్త సైకిల్ ఇచ్చి సహకరించారు. శబరిమలై యాత్రకు సంబంధించి ఏ విధమైన సహకారమైనా సరే అందిస్తామని జనసేన పార్టీ నాయకులు శ్రీకాంత్ రెడ్డి , శాకారి శీను బాబు, ఆకుల శివ, కాకి సందీప్ ప్రకాష్ , గొల్లి సతీష్ హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో 5 వ వార్డు జన సైనికులు పాల్గొని ర్యాలీగా కొంతవరకు వెళ్లి వారికి క్షేమంగా వెళ్లి తిరిగి రావాలని కోరారు.

