విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాద సంఘటనా స్థలాన్ని సందర్శించి బాధితుల పరామర్శించిన బిజెపి ఎంపీ జీవీఎల్ నరసింహారావు

విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాద సంఘటనా స్థలాన్ని  సందర్శించి బాధితుల పరామర్శించిన బిజెపి ఎంపీ జీవీఎల్ నరసింహారావు. 

ఫిషింగ్ హార్బర్ : వి న్యూస్ : నవంబర్ 21:

జీవీఎల్ కామెంట్స్ మాట్లాడుతూ హార్బర్ లో అగ్ని ప్రమాదం దారుణం ప్రాధమిక అంచనా ప్రకారం 33 బోట్లుగా నిర్థారించారు ఇంకా ఉన్నట్టు అంచనా కేంద్ర మంత్రి రూపాలాతో మాట్లాడాను నష్ట పోయిన మత్స్యకారులకు న్యాయం చేస్తానని చెప్పారు వారి తరపున, కేంద్ర ప్రభుత్వం తరపున ఆయనే స్వయంగా నన్ను పంపారు కేంద్ర శాఖకు ఈ రోజు నష్ట అంచనా నివేదిక పంపనున్నాం ప్రమాదానికి గల కారణమేంటని ఇప్పటివరకు పోలీసులు తెలుసుకోలేకపోయారు అదృష్టవశాత్తు ప్రాణహాని జరగ లేదు సంవత్సరం క్రితం ఫిషింగ్ హార్బర్ సందర్శనకు వచ్చినప్పుడు ఇక్కడ పోలీస్ పోస్ట్ ఒకటి పెట్టాలని నేను కోరడం జరిగింది అసాంఘిక కార్యకలాపాలు జరగకూడదని అందుకు అవసరమైన చర్యలు తీసుకొమని గతంలోనే లిఖిత పూర్వకంగా ఫిర్యాదు ఇచ్చాను కానీ ఇప్పటికీ అది సాకారం కాలేదు అలాంటి జాగ్రత్తలు తీసుకుని వుంటే ఈ రోజు ఇలాంటి దుశ్చర్య జరిగి ఉండేది కాదు మత్స్యకారులకు రక్షణ కల్పించాల్సిన భాద్యత పోలీసులపై ఉంది వెంటనే ఇక్కడ పోలీస్ పోస్ట్ ఏర్పాటు చేయాలి జరిగిన నష్టానికి ప్రాధమిక  భాద్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉంటుంది హామీలు ఇచ్చి సంవత్సరాల పాటు తాత్సారం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే నష్ట పరిహార హామీ అమలు చేయాలి రేపటి లోపలే నష్ట పరిహారాన్ని చెల్లించాలి కేంద్రప్రభుత్వ సంస్థల ద్వారా కూడా వీలైనంత వరకు నష్టాన్ని పూడ్చ డానికి నేను ప్రయత్నిస్తాను.